ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ‘దురందర్’ చిత్రంలో నటించిన నదీమ్ ఖాన్, లైంగిక వేధింపుల ఆరోపణలపై ముంబై పోలీసుల చేత అరెస్ట్ అయ్యారు. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించి, గత నెలలో విడుదలై రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రంలో నదీమ్ ఖాన్ ఒక కీలక పాత్ర పోషించారు.
ఆరోపణల వివరాలు: తన వద్ద ఇంటి పని చేసే 41 ఏళ్ల మహిళను గత 10 ఏళ్లుగా నదీమ్ ఖాన్ లైంగికంగా వేధిస్తున్నారని దిగ్భ్రాంతికరమైన ఫిర్యాదు నమోదైంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె 2015 నుండి నదీమ్ ఖాన్ వద్ద పనిచేస్తోంది. ఆ మహిళను వివాహం చేసుకుంటానని నమ్మబలికి, గత పదేళ్లుగా ఆమెను లోబరుచుకున్నారని సమాచారం. అయితే, చివరకు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ఆమె ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు జనవరి 22న నదీమ్ ఖాన్ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది.
