“తెలియక వచ్చి ఇరుక్కుపోయానా..!” – ఇంట్లోకి చొరబడిన దొంగను చితకబాదిన బాలికలు మరియు మహిళలు.. వైరల్ అవుతున్న సిసిటివి వీడియో..!!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్‌లో ఒక మహిళా డాక్టర్ ఇంట్లోకి అక్రమంగా చొరబడిన గుర్తు తెలియని వ్యక్తికి, అక్కడి బాలికలు మరియు మహిళలు కలిసి దేహశుద్ధి చేసిన ఘటన సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది.

గత మార్చి 21న ఈద్ పండుగ రోజున, డాక్టర్ సల్మా నశీర్ ఇంట్లోకి దొంగతనం చేసే ఉద్దేశంతో ప్రవేశించిన ఆ ఆగంతకుడిని చూసి భయపడి అరిచే బదులు, ఆ ఇంటి బాలికలు చూపిన ధైర్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, వదలకుండా వెంటాడి పట్టుకుని ఆ బాలికలు అతడిని చితకబాదారు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సిసిటివి (CCTV) కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఈ ‘వీర బాలికల’ సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ, ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మొరాదాబాద్ పోలీసులు, పరారీలో ఉన్న ఆ అనుమానిత వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.


Posted

in

by

Tags: