తెల్లవారుజామున ఘోరం.! నిద్రిస్తున్న 15 ఏళ్ల బాలుడిపై కూలిన ఇంటి పైకప్పు: మృతదేహం వద్ద లభ్యమైన తుపాకీ బుల్లెట్లు.. కలకలం రేపుతున్న ఘటన.!!

తూర్పు ఢిల్లీలోని వెల్‌కమ్ ప్రాంతంలో సెప్టెంబర్ 6 తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.

తన కవల సోదరుడితో కలిసి గదిలో గాఢనిద్రలో ఉన్న 15 ఏళ్ల బాలుడిపై, ఆ గది పైకప్పునకు చెందిన సిమెంట్ పెచ్చులు హఠాత్తుగా విరిగిపడ్డాయి. ఆర్తనాదాలు విని పరుగెత్తుకొచ్చిన కుటుంబసభ్యులు, ఇద్దరు పిల్లలను వెంటనే ఆనంద్ విహార్‌లోని కైలాష్ దీపక్ ఆసుపత్రికి తరలించారు.

అయితే, ఆ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గాయపడిన మరో సోదరుడికి ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో అతడి వద్ద నుంచి 5 తుపాకీ బుల్లెట్లు (లైవ్ రౌండ్లు) లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. పైకప్పు కూలి బాలుడు మృతి చెందిన కేసుతో పాటు, అక్రమ ఆయుధాల నియంత్రణ చట్టం (ఆర్మ్స్ యాక్ట్) కింద కూడా కేసు నమోదు చేసి ఢిల్లీ పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *