కర్ణాటక: భర్తకు దూరంగా ఒంటరిగా జీవిస్తున్న 50 ఏళ్ల లక్ష్మీ దేవమ్మ అనే మహిళకు, బోరుబావుల కార్మికుడైన 55 ఏళ్ల నాగరాజుతో పరిచయమై అది వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ తరచూ ఏకాంతంగా కలుసుకునేవారు.
ఇంతలోనే, లక్ష్మీ దేవమ్మకు అదే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల యువకుడితో కొత్తగా పరిచయం ఏర్పడింది. దీంతో ఆమె నాగరాజును దూరం పెట్టి, ఆ యువకుడితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. విషయం తెలుసుకున్న నాగరాజు, “అతనితో మాట్లాడొద్దు” అని హెచ్చరించినప్పటికీ లక్ష్మి పట్టించుకోలేదు.
దీంతో ఆగ్రహం చెందిన నాగరాజు, తాను పనిచేస్తున్న తోట వద్దకు లక్ష్మిని తీపి మాటలతో రప్పించాడు. అక్కడ ఇద్దరూ ఏకాంతంగా గడిపిన అనంతరం, ఆ యువకుడి ప్రస్తావన తెచ్చి ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు.
గొడవ ముదరడంతో తీవ్ర ఆవేశానికి లోనైన నాగరాజు, పక్కనే ఉన్న కర్రతో లక్ష్మి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో లక్ష్మి ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది.
హత్యను కప్పిపుచ్చేందుకు మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లి నిప్పంటించాడు. మరుసటి రోజు సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసిన తోట యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన నాగరాజును అరెస్ట్ చేశారు.

Leave a Reply