థాయిలాండ్ తన వీసా నిబంధనల్లో కీలక మార్పులు చేస్తోంది. గతంలో ఉన్న నిబంధనలను సరళతరం చేస్తూ, దేశ భద్రత మరియు పర్యాటక రంగాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త నిర్ణయాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో, భారతీయులు వీసా లేకుండా లేదా సులభంగా వీసా పొందే అవకాశం ఉన్న కొన్ని ఇతర అద్భుతమైన పర్యాటక ప్రాంతాల జాబితా ఇక్కడ ఉంది:
- మాల్దీవులు (Maldives)
ఇది కేవలం ధనికులకు మాత్రమే కాదు, బడ్జెట్ ప్రయాణికులకు కూడా సరైన వేదిక. మాఫుషి (Maafushi), ఫులిధూ (Fulidhoo) వంటి స్థానిక దీవుల్లో తక్కువ ఖర్చుతో బస చేయవచ్చు. భారతీయులకు 30 రోజుల పాటు వీసా లేకుండా ప్రవేశం ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి నేరుగా విమాన సౌకర్యం ఉంది. 4-5 రోజుల ట్రిప్‌కు సుమారు ₹55,000 నుంచి ₹70,000 వరకు ఖర్చవుతుంది. - మలేషియా (Malaysia)
అడవులు, షాపింగ్, సంప్రదాయ వంటకాలకు మలేషియా మంచి ఎంపిక. లంకవి (Langkawi) దీవుల్లో షాపింగ్, పినాంగ్ (Penang) లో స్ట్రీట్ ఫుడ్ చాలా ప్రసిద్ధి. ఇక్కడ 5-6 రోజుల బసకు ఒక వ్యక్తికి ₹45,000 నుంచి ₹70,000 వరకు ఖర్చు కావచ్చు. - సీషెల్స్ (Seychelles)
అద్భుతమైన తీరప్రాంతాలు, కొండలకు ఇది నెలవు. లా డిగు (La Digue) దీవిలో సైకిల్ ప్రయాణం, ప్రస్లిన్ (Praslin) లో ట్రెక్కింగ్, మాహే (Mahé) ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. 4-5 రోజుల పర్యటనకు సుమారు ₹75,000 – ₹80,000 వరకు ఖర్చు అవుతుంది. - మారిషస్ (Mauritius)
ఇక్కడ భారతీయులు ఎక్కువగా ఉండటంతో మనకు నచ్చిన ఆహారం సులభంగా దొరుకుతుంది. గ్రాండ్ బే (Grand Baie), ఫ్లిక్ ఎన్ ఫ్లాక్ (Flic en Flac) బస చేయడానికి ఉత్తమమైన ప్రదేశాలు. స్నోర్కెలింగ్ కోసం ఐల్ ఆక్స్ సెర్ఫ్స్ (Île aux Cerfs) వెళ్ళవచ్చు. 5 రోజుల ట్రిప్‌కు సుమారు ₹70,000 – ₹80,000 వరకు ఖర్చవుతుంది. ఈ జాబితాలో ఇండోనేషియా మరియు శ్రీలంక కూడా ఉన్నాయి.
