ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి 20 ఏళ్ల యువతిగా మార్చిన ఫోటోను చూసి 27 ఏళ్ల యువకుడు ప్రేమలో పడ్డాడు. కానీ, తీరా నేరుగా వెళ్లి చూసేసరికి అక్కడో వయసు పైబడిన మహిళ కనిపించడంతో ఖంగుతిన్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కరోనా సమయంలో భర్తను కోల్పోయిన ఇద్దరు పిల్లల తల్లి ఊర్మిళ.. ఏఐ టెక్నాలజీ సాయంతో తన ముఖాన్ని పూర్తిగా మార్చేసి 20 ఏళ్ల యువతిలా ఉన్న అందమైన, ఆకర్షణీయమైన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ ఫోటోను చూసి మోసపోయిన 27 ఏళ్ల యువకుడు, ఊర్మిళతో ఆన్లైన్లో విపరీతంగా చాటింగ్ చేస్తూ పీకల్లోతు ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఆమెను ఓ పార్కులో నేరుగా కలవాలని ఆహ్వానించాడు.
తమ మొదటి కలయిక కోసం ఎంతో ఆసక్తిగా ఆ పార్కుకు వెళ్లి ఎదురుచూస్తున్న ఆ యువకుడికి.. ఏఐ సుందరికి బదులుగా అసలైన ఊర్మిళను చూసేసరికి మాట పడిపోయి షాక్కు గురయ్యాడు.
వెంటనే చేతులెత్తి దండం పెట్టి అక్కడినుంచి మెల్లగా జారుకున్న ఈ ఫన్నీ సంఘటన.. ఆన్లైన్లో ఏఐ ఫోటోలను, ఫిల్టర్లను గుడ్డిగా నమ్మి మోసపోకూడదనే వాస్తవాన్ని కళ్లకు కడుతోంది.

Leave a Reply