దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును ముందుండి నడిపిస్తున్న కెప్టెన్ టెంబా బవుమా అద్భుతమైన నాయకత్వ లక్షణాలను, అతను జట్టులో తీసుకొచ్చిన మార్పులను దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం షాన్ పొలాక్ ఎంతో ఉద్వేగంతో ప్రశంసించారు.
దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించిన తర్వాత కామెంటరీ బాక్స్‌లో మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు షాన్ పొలాక్ మాట్లాడుతూ.. టెంబా బవుమా గురించి ఇలా అన్నారు:
“టెంబా బవుమా పుట్టుకతోనే గొప్ప నాయకుడు (Born Leader). దక్షిణాఫ్రికా క్రికెట్‌లో మళ్లీ ఆ నమ్మకాన్ని నాటింది అతనే. చివరి వరకు పోరాడే స్ఫూర్తిని, ఎవరికీ భయపడని దూకుడు విధానాన్ని జట్టులోకి బవుమా తీసుకొచ్చాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ రూపురేఖలనే అతను పూర్తిగా మార్చేశాడు” అని కొనియాడారు.
అనంతరం షాన్ పొలాక్ బవుమా అంకితభావాన్ని గుర్తుచేసుకుంటూ ఇలా మాట్లాడారు:
“అతను జట్టుకు అందిస్తున్న సహకారానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఈ విజయం అతనికి, అతని కుటుంబానికి ఎంతో గొప్ప అర్థాన్ని ఇస్తుంది. అతను ముందుండి నడిపించే నిజమైన కెప్టెన్. అద్భుతమైన గుణాలు కలిగిన ఒక ప్రత్యేకమైన ఆటగాడు. వాట్ ఏ ఛాంపియన్ ప్లేయర్! అతనికి నా హాట్స్ ఆఫ్ (Hats off)” అని ఆయన ఉద్వేగంగా తెలిపారు.
