దయచేసి ఇంటికి వచ్చేయమ్మా..! “నడిరోడ్డుపై చేతులెత్తి మొక్కుతూ కన్నీరు మున్నీరైన వృద్ధ తండ్రి”.. పెంచిన ప్రేమను మరిచి ప్రియుడితో వెళ్లిన కూతురు! వైరల్ వీడియో!

న్యూఢిల్లీ: కన్నప్రేమ కంటే తనే నమ్ముకున్న ప్రేమే గొప్పదని భావించి, ప్రాణంగా పెంచిన తండ్రిని నడిరోడ్డుపై రోదించేలా చేసి ఒక యువతి తన ప్రియుడితో వెళ్లిన హృదయ విదారక వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఆ వీడియో వివరాల ప్రకారం.. ప్రియుడితో కలిసి ఇల్లు వదిలి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న ఒక యువతిని, ఆమె వృద్ధ తండ్రి నడిరోడ్డుపై అడ్డుకుని పట్టుకున్నాడు.

సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి లోనవడం సహజం. కానీ, ఈ తండ్రి మాత్రం తన కూతురిని కొట్టడం గానీ, కనీసం తిట్టడం గానీ చేయలేదు. దానికి బదులుగా, “దయచేసి నాతో ఇంటికి వచ్చేయమ్మా” అంటూ నడిరోడ్డుపైనే చేతులు జోడించి, కన్నీళ్లు పెట్టుకుంటూ బతిమిలాడాడు. అయినప్పటికీ, ఆ యువతి మాత్రం తండ్రి కన్నీళ్లను చూసి ఏమాత్రం చలించకుండా, తన ప్రియుడితో వెళ్లడానికే మొండిగా పట్టుబట్టింది.

పోలీస్ కేసు పెడతానంటూ బెదిరింపు: తండ్రి పదే పదే ఆమెను అడ్డుకుంటూ ఇంటికి పిలవడానికి ప్రయత్నించినప్పుడు.. “నా జీవితాన్ని నా ఇష్టప్రకారం బతకనివ్వు” అని సదరు యువతి గట్టిగా అరిచింది. అంతటితో ఆగకుండా, తన ప్రియుడి చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు నడవడం ప్రారంభించింది. అప్పుడు కూడా వదలకుండా తన వెనుక వస్తున్న వృద్ధ తండ్రిని చూసి.. “ఇకపైనా నన్ను అడ్డుకుంటే నీ మీద పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెడతాను” అని బహిరంగంగా బెదిరించి, ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.

నెటిజన్ల భిన్నాభిప్రాయాలు: ఈ వీడియోను ప్రస్తుతం లక్షలాది మంది వీక్షించడంతో ఇంటర్నెట్‌లో ఇది ఒక వైరల్ మారింది. కూతురి ప్రవర్తనతో మనస్తాపానికి గురై, నడిరోడ్డుపై నిస్సహాయంగా నిలబడిపోయిన ఆ తండ్రి పరిస్థితిని చూసి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. “మా తండ్రి గనుక అయి ఉంటే అక్కడే పట్టుకుని లాక్కెళ్లేవారు” అని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం “సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు, స్వేచ్ఛ యువతులకు ఉన్నప్పటికీ.. ప్రాణంకంటే ఎక్కువగా పెంచిన తండ్రిని ఇలా నడిరోడ్డుపై అవమానించి, కన్నీరు పెట్టించడం అస్సలు కరెక్ట్ కాదు” అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *