“దయచేసి నన్ను కాపాడండి..!” అనుమతి లేకుండా తిన్నందుకు ఇలాంటి క్రూరమైన శిక్షా.. రూమ్‌మేట్ పెదాలను సూది దారంతో కుట్టుకోమని బెదిరించిన మహిళ.. కోర్టులో బట్టబయలైన సంచలన వాంగ్మూలం..!!

జపాన్‌లో తనతో పాటు ఉంటున్న 42 ఏళ్ల మహిళను బెదిరించి, ఆమె పెదాలను ఆమె చేతే సూది, దారంతో కుట్టించినట్లు 50 ఏళ్ల మహిళ కోర్టులో అంగీకరించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

టోక్యో సమీపంలోని ఇబరాకి కోర్టులో జరిగిన విచారణలో, మసాయే సకురాయ్ (Masae Sakurai) అనే ఆ మహిళ తనపై ఉన్న ఆరోపణలను అంగీకరించారు. అంతకుముందు “పని చేయని వారు తినకూడదు” అని చెబుతూ సకురాయ్ తన రూమ్‌మేట్‌ను పస్తులు ఉంచారని, అయితే ఆ మహిళ అనుమతి లేకుండా ఆహారం తినడంతో ఆగ్రహించి ఈ దారుణానికి ఒడిగట్టారని ప్రాసిక్యూషన్ (ప్రభుత్వ తరఫు న్యాయవాదులు) కోర్టుకు తెలిపింది.

గత జూన్ 18 నుంచి 24వ తేదీల మధ్య జరిగిన ఈ ఘటనలో, “నేను కుడితే నొప్పి రెట్టింపు అవుతుంది” అని బెదిరించి, బాధితురాలిని తన పెదాలను తానే కుట్టుకునేలా సకురాయ్ బలవంతం చేశారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా కోర్టులో ఆధారాలుగా సమర్పించారు.

ఆ తర్వాత, కోగా నగరంలోని ఆ ఇంటి నుంచి తప్పించుకున్న 42 ఏళ్ల మహిళ, దగ్గర్లోని ఓ దుకాణానికి పరుగెత్తుకు వెళ్లి “దయచేసి నాకు సాయం చేయండి” అని రాసి ఉన్న కాగితాన్ని చూపించడంతోనే ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

మొదట్లో సకురాయ్ స్వయంగా పెదాలు కుట్టేశారనే ఆరోపణలతో జూన్‌లో ఆమెను అరెస్టు చేసినప్పటికీ, ఆ తర్వాత ఆ మహిళను బెదిరించి ఆమె చేతే కుట్టించినట్లు ఛార్జిషీట్ దాఖలు చేయగా, సకురాయ్ తన నేరాన్ని కోర్టులో అంగీకరించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *