తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరియు ఆయన భార్య సంగీతల మధ్య నడిచిన విడాకుల కేసు వ్యవహారం, దాని వెనుక ఉన్న రాజకీయ మలుపులపై సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఒక సంచలన వార్త ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సంగీత తన విడాకుల పిటిషన్‌ను అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడం యాదృచ్ఛికం కాదని, అదొక పక్కా వ్యూహంతో ఆడిన రాజకీయ చదరంగమని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఒకవేళ సంగీత విడాకులు ఇచ్చి ఉంటే సీఎం విజయ్ తన రాజకీయ మరియు వ్యక్తిగత నిర్ణయాల్లో పూర్తి స్వేచ్ఛగా వ్యవహరించి ఉండేవారని, అయితే ఈ ఊహించని మలుపుతో ఆయన వేసే అడుగులకు బ్రేకులు పడ్డాయని అందులో రాసుకొచ్చారు.
మొదట్లో సంగీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోవడం తనకు ఊరటనిచ్చిందని పేర్కొన్న సదరు నెటిజన్.. తాజా పరిణామాలను గమనిస్తే ఆమె సామాన్యురాలు కాదని, రాజకీయ ఎత్తుగడల్లో ఒక ‘గ్రాండ్‌మాస్టర్’లా చక్రం తిప్పారని విశ్లేషించారు. తాను ఈ ట్వీట్‌ను ఆగస్టు 7, 2026 నాడే రాసి పెట్టుకున్నానని, దంపతులిద్దరూ రాజీపడి కలిసిపోతారేమోనన్న ఉద్దేశంతో పోస్ట్ చేయడం ఆలస్యం చేశానని.. అయితే ప్రస్తుత పరిణామాలు తన అంచనా నూటికి నూరు శాతం నిజమని నిరూపించాయని నెటిజన్ పేర్కొన్నారు.
సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న ఈ సోషల్ మీడియా పోస్ట్‌తో ముఖ్యమంత్రి విజయ్ కుటుంబ వ్యవహారాలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
