హర్యానా రాష్ట్రం పంచకులకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ ‘MITS హెల్త్‌కేర్’ వ్యవస్థాపకుడు మరియు యజమాని అయిన ఎం.కె. భాటియా, తన సంస్థ అభివృద్ధికి, విజయానికి అండగా నిలిచిన ఉద్యోగుల కఠోర శ్రమను, నిజమైన అంకితభావాన్ని గుర్తిస్తూ.. వారికి సరికొత్త కియా సోనెట్ (Kia Sonet) ఎస్‌యూవీ కార్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు.
పండుగ సీజన్‌లో కంపెనీ యజమాని ఇచ్చిన ఈ భారీ సర్ప్రైజ్ గిఫ్ట్.. అటు ఉద్యోగుల్లో, ఇటు ఇంటర్నెట్‌లో తీవ్ర భావోద్వేగాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ ప్రత్యేక వాహన పథకం కింద, బహుమతిగా ఇస్తున్న కియా సోనెట్ కార్లకు సంబంధించిన 30% డౌన్ పేమెంట్‌ను (Down Payment) MITS హెల్త్‌కేర్ సంస్థే పూర్తిగా చెల్లిస్తుంది. అదే సమయంలో, ఈ వాహనాలన్నీ నేరుగా ఉద్యోగుల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయబడతాయి. అంతేకాకుండా, ఉద్యోగులు ఆ సంస్థలో కొనసాగుతున్నంత కాలం వారి నెలవారీ వాయిదాలను (EMI), వాహన నిర్వహణ ఖర్చులను కూడా కంపెనీయే భరిస్తుంది.
గత సంవత్సరాల్లోనూ తన కంపెనీలోని ఉత్తమ ఉద్యోగులకు మహీంద్రా స్కార్పియో, టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్ వంటి పలు కార్లను బహుమతిగా అందిస్తూ కార్పొరేట్ ప్రపంచంలో ఎం.కె. భాటియా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. తన కంపెనీ ఉద్యోగులను కేవలం పనివాళ్లుగా మాత్రమే చూడకుండా ‘సూపర్ స్టార్స్’గా భావించే ఆయన తీసుకున్న ఈ సంచలన నిర్ణయం, సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

Leave a Reply