చలికాలంలో వెచ్చదనం కోసం మనం బరువైన దుప్పట్లను వాడుతుంటాం. కానీ వేసవి రాకముందే వాటిని భద్రపరిచే (Store) సమయం వచ్చినప్పుడు, ఆ దుప్పట్లను శుభ్రం చేయడం ఒక తలనొప్పిగా మారుతుంది. కొంతమంది వీటిని డ్రై క్లీనింగ్‌కు ఇస్తారు లేదా మెషిన్లో ఉతుకుతారు. దీనివల్ల ఖర్చు పెరగడమే కాకుండా దుప్పటి నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అలాంటప్పుడు తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో దుప్పట్లను ఎలా శుభ్రం చేయాలో ఇక్కడ చూద్దాం.
బరువైన దుప్పట్లను ఉతికే పద్ధతి:
దుప్పటిని ఉతకడానికి ఒక పెద్ద బకెట్ లేదా టబ్‌లో నీళ్లు తీసుకుని, అందులో లిక్విడ్ డిటర్జెంట్ బాగా కలపండి. గమనిక: పొడి సర్ఫ్ (Powder detergent) వాడకండి, ఎందుకంటే దాని రేణువులు దుప్పటి దారాల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆ నీటిలో దుప్పటిని కనీసం 2 గంటల పాటు నాననివ్వండి.
ఎండలో వేసే ముందు ఈ పని చేయండి:
సర్ఫ్ నీటి నుండి దుప్పటిని తీసి, శుభ్రమైన నీటితో రెండు మూడు సార్లు కడగండి. గరుకుగా ఉండే బ్రష్‌తో రుద్దకండి. చేతులతో తేలికగా పిండి, టబ్‌ను బోర్లించి దానిపై దుప్పటిని రాత్రంతా వదిలేయండి. ఇలా చేయడం వల్ల అందులోని నీరంతా కారిపోతుంది. ఆ తర్వాత బట్టల తీగపై 2-3 గంటల పాటు ఎండలో ఆరబెడితే మీ దుప్పటి భద్రపరచుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
ఉతకకుండానే దుప్పటిని శుభ్రం చేసే ట్రిక్:
మీరు హాస్టల్లో ఉన్నా లేదా దుప్పటి ఉతికే సమయం లేకపోయినా ఈ పద్ధతి పాటించవచ్చు:
- ముందుగా దుప్పటిని బెడ్ మీద శుభ్రంగా పరచండి.
- ఒక సీసా నీటిలో 4-5 చెంచాల టాల్కమ్ పౌడర్, కొంచెం వైట్ వెనిగర్ కలిపి మిశ్రమాన్ని తయారు చేయండి.
- ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసి దుప్పటికి రెండు వైపులా బాగా చల్లండి.
- దుప్పటిని 15-20 నిమిషాల పాటు ఎండలో ఉంచండి.
- చివరగా ఒక మెత్తని కార్పెట్ బ్రష్‌తో దుప్పటిని దువ్వండి (Brushing). దీనివల్ల చిన్నపాటి మరకలు పోవడమే కాకుండా దుప్పటి మంచి వాసన వస్తూ, బ్యాక్టీరియా రహితంగా మారుతుంది.
