దుబాయ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌పై పడ్డ క్షిపణి… భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు; వణికిస్తున్న సి.సి.టి.వి దృశ్యాలు

అమెరికా – ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేళ, దీనికి ప్రతికారంగా అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దుబాయ్, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది.

ఈ క్రమంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన దాడి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. దుబాయ్ విమానాశ్రయమే కాకుండా, ఆ నగరం యొక్క ఐకాన్ అయిన బుర్జ్ అల్ అరబ్ హోటల్ వంటి ప్రాంతాలపై కూడా ఇరాన్ రాత్రిపూట దాడులు నిర్వహించింది. ఈ దాడుల వల్ల స్వల్ప నష్టం వాటిల్లిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడినట్లు ఎమిరేట్స్ మీడియా కార్యాలయం ధృవీకరించింది.

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) లోని ఒక టెర్మినల్ భాగం ఈ దాడిలో దెబ్బతిన్నదని, అయితే అత్యవసర రక్షణ బృందాలు పరిస్థితిని వెంటనే అదుపులోకి తెచ్చాయని దుబాయ్ మీడియా ఆఫీస్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొంది.

ముఖ్య పరిణామాలు:

  • ప్రతీకారం: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణానికి ప్రతికారంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
  • బుర్జ్ అల్ అరబ్: ఒక డ్రోన్‌ను గాలిలోనే అడ్డుకున్నప్పుడు, దాని శకలాలు పడి హోటల్ వెలుపలి భాగంలో స్వల్పంగా మంటలు చెలరేగాయి.
  • విమానాల రద్దు: ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్, అబుదాబీ మరియు దోహా మధ్య నడిచే అనేక విమాన సర్వీసులను రద్దు చేశారు. మధ్యప్రాచ్య గగనతలం (Airspace) దాదాపు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
  • జబల్ అలీ పోర్ట్: గాలిలో పేల్చివేసిన క్షిపణి శకలాలు పడటంతో జబల్ అలీ ఓడరేవులోని ఒక నౌక వద్ద మంటలు చెలరేగాయి.

Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *