“దుర్వాసన వెదజల్లిన వాటర్ ట్యాంక్!” శుభ్రం చేసేందుకు దిగిన విద్యార్థుల ఘోర మృతి.. గురుకులంలో చోటుచేసుకున్న గుండెలు పిండే విషాదం..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లా బృందావన్‌లోని చైతన్య విహార్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ గురుకులంలో, వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి లోపలికి దిగిన నలుగురు విద్యార్థులు ఊపిరాడక దుర్మరణం చెందిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.

గురుకులంలోని తాగునీటి ట్యాంక్ నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో, దానిని శుభ్రం చేసేందుకు ఐదుగురు విద్యార్థులను ట్యాంక్‌లోకి దింపారు. ఆ సమయంలో ఊహించని విధంగా వెలువడిన విషవాయువు పీల్చడంతో పాటు, శ్వాస తీసుకోవడం కష్టమై ట్యాంక్ లోపలే నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మథుర జిల్లా కలెక్టర్ చంద్రప్రకాశ్ సింగ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, సమగ్ర విచారణకు ఆదేశించారు.

ఈ దారుణం జరిగిన వెంటనే గురుకులం నిర్వాహకుడు ఆశిష్ శర్మ పరారయ్యాడు. విద్యార్థుల మరణానికి కారణమైన గురుకుల యాజమాన్య నిర్లక్ష్య వైఖరిపై చర్యలు చేపట్టిన పోలీసులు, నిర్లక్ష్యం కారణంగా మరణానికి కారణమవ్వడం సహా పలు కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిర్వాహకుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *