కేరళ రాష్ట్రంలో ‘దెయ్యాన్ని వదిలిస్తాననే’ నెపంతో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన పూజారికి న్యాయస్థానం 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
నేరస్థుడైన రాజేష్ అనే పూజారికి నెడుమంగాడ్ (Nedumangad) ప్రత్యేక న్యాయస్థానం ఈ జైలు శిక్షతో పాటు రూ. 50,000 జరిమానా కూడా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
2016 ఏప్రిల్ నెలలో జరిగిన ఈ ఘటనలో.. సదరు మహిళ భర్తకు పట్టిన ‘దెయ్యాన్ని వదిలించేందుకు’ ప్రత్యేక పూజలు చేయాలని నమ్మించి ఆ పూజారి ఆమెను పిలిపించాడు.
ఆ తర్వాత, ప్రార్థనా మందిరంలోని ఓ స్టోర్ రూమ్‌లో (సామాన్లు భద్రపరిచే గదిలో) ఉంచి ఆ మహిళపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అకృత్యం వరుసగా పలు రోజుల పాటు కొనసాగడంతో, ఆ మహిళ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఆ పూజారిని అరెస్టు చేశారు.
ఈ కేసును లోతుగా విచారించిన న్యాయమూర్తి, పూజారి రాజేష్‌ను దోషిగా నిర్ధారించి 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. అంతేకాకుండా, విధించిన జరిమానాను చెల్లించని పక్షంలో అదనంగా మరో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాలని తన తీర్పులో స్పష్టం చేశారు.

Leave a Reply