“దేవుడా!.. పస్తులుంటే యేసుక్రీస్తును కలవొచ్చా!”.. 191 మందిని బలితీసుకున్న క్రూరమైన మత గురువు.. ప్రపంచాన్ని కుదిపేసిన అమానవీయ మరణాలు.. న్యాయస్థానం విధించిన కఠిన శిక్ష..!!!

కెన్యా దేశానికి చెందిన పాల్ మెకెంజీ అనే మతబోధకుడు, తన విపరీతమైన బోధనలతో ప్రజలను నమ్మించి చేసిన క్రూరమైన చర్య ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించింది.

తనను అనుసరించే వారు ఆహారం మానేసి కఠినంగా పస్తులుంటే నేరుగా యేసుక్రీస్తును కలుసుకోవచ్చని అతను తన మద్దతుదారులను బ్రెయిన్‌వాష్ చేసి నమ్మించాడు.

ఇది నమ్మి వందలాది మంది ప్రజలు ఆహారం తీసుకోకుండా బలవంతపు ఉపవాస దీక్షలో (పస్తులుండటంలో) పాల్గొనడం వల్ల, దారుణంగా 191 మంది ప్రాణాలు కోల్పోయారు. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న ఈ అత్యంత క్రూరమైన నేరానికి గాను, ఈ కేసును విచారించిన మొంబాసా హైకోర్టు.. మతబోధకుడు పాల్ మెకెంజీకి ఏకంగా 200 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

మతం పేరుతో అమాయక ప్రజలను మోసగించి మరణ మార్గంలోకి తీసుకెళ్లిన ఇలాంటి వ్యక్తులకు న్యాయస్థానం విధించిన ఈ కఠిన శిక్ష ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *