దేవుడా..! 3 రోజులుగా పురిటి నొప్పులతో గర్భిణి ఆర్తనాదాలు.. వైద్యుల నిర్లక్ష్యం.. “ఏం చేసుకుంటారో చేసుకోండి”.. SRN ఆసుపత్రిలో తీవ్ర ఘర్షణ..!!

ప్రయాగ్‌రాజ్‌లోని ప్రముఖ SRN ఆసుపత్రిలో కాన్పు కోసం చేరిన ఓ గర్భిణి, మూడు రోజులుగా డెలివరీ చేయకపోవడంతో తీవ్ర నరకయాతన అనుభవిస్తోంది.

ఈరోజే డెలివరీ పూర్తి చేయాలని సీనియర్ డాక్టర్ ఆదేశించినప్పటికీ, అక్కడి సిబ్బంది పట్టించుకోలేదని.. పురిటి నొప్పులతో ఆ మహిళ నరకం చూస్తూ విలవిల్లాడుతోందని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపించారు.

రోగులతో బయటి నుంచి మందులు, వైద్య సామగ్రిని కొనిపిస్తూ బిల్లులు పెంచేందుకు ఆసుపత్రి యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితురాలి బంధువులు, ఆసుపత్రి సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ గొడవ కాస్తా పరస్పరం బూతులు తిట్టుకుంటూ కొట్టుకునే స్థాయికి దారితీసింది.

పరిస్థితి చేయిదాటి ఉద్రిక్తంగా మారడంతో బాధిత కుటుంబ సభ్యులు తక్షణమే డయల్ 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బెదిరింపులకు భయపడని రోగి సోదరి.. “వీడియోలు తీసినా భయపడేది లేదు.. మీరేం చేసుకుంటారో చేసుకోండి” అంటూ ఆసుపత్రి సిబ్బందిని ధైర్యంగా నిలదీశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *