“నగ్నంగా ఉన్న వినియోగదారులు.. వేడుక చూస్తున్న AI” – స్మార్ట్ గ్లాస్ కెమెరాల ఘోరం.. షాకింగ్ రిపోర్ట్!

మెటా సంస్థకు చెందిన ‘AI స్మార్ట్ గ్లాసెస్’ (Meta Smart Glasses) వాడుతున్న వారి అత్యంత వ్యక్తిగత వీడియోలను, ఆ AI సిస్టమ్‌కు శిక్షణ ఇచ్చే సిబ్బంది చూస్తున్నారనే ఆరోపణలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.

కెన్యాకు చెందిన ‘సామా’ (Sama) అనే సంస్థ ఉద్యోగులు ఈ విషయాలను బయటపెట్టారు. స్మార్ట్ గ్లాసెస్ ద్వారా రికార్డ్ అయిన బాత్‌రూమ్ దృశ్యాలు, శృంగార మరియు నగ్న దృశ్యాలను తాము చూడాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఈ రహస్యాలు బయటకు పొక్కిన కొన్ని వారాల వ్యవధిలోనే, మెటా సంస్థ సామా కంపెనీతో ఉన్న తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

దీనివల్ల సుమారు 1,108 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. నాణ్యత నియంత్రణ (Quality Control) కారణాల వల్లనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని మెటా చెబుతున్నప్పటికీ, ఉద్యోగుల పనితీరు మరియు వ్యక్తిగత గోప్యతా ఉల్లంఘనలను వారు బయటపెట్టినందుకే ఈ చర్య తీసుకున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. వినియోగదారుల అనుమతితోనే ఈ డేటాను విశ్లేషిస్తున్నామని మెటా వాదిస్తున్నప్పటికీ, ఓ మహిళకు తెలియకుండానే ఆమె బట్టలు మార్చుకుంటున్న దృశ్యం రికార్డ్ కావడం తీవ్ర వివాదానికి దారితీసింది. AI సాంకేతికత అభివృద్ధి వెనుక ఉన్న మానవ శ్రమ మరియు వ్యక్తిగత గోప్యత రక్షణపై ఇది పెద్ద చర్చకు తెరలేపింది.


Posted

in

by

Tags: