చాలామంది హీరోయిన్లు తమ చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి కయాదు లోహర్ తన పాఠశాల రోజుల్లో ఎదురైన ఈవ్-టీజింగ్ అనుభవం గురించి పంచుకున్నారు. ఆ ఆకతాయిని ఆమె ఎలా ఎదుర్కొన్నారో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే!
ఏమి జరిగింది? కన్నడ చిత్రం ‘ముగిల్ పేటె’తో పరిచయమైన కయాదు లోహర్, ప్రస్తుతం దక్షిణాది చిత్రాల్లో నటిస్తోంది. ఆమె 10వ తరగతి చదువుతున్నప్పుడు ఒక యువకుడు రోజు తనను వెంబడిస్తూ వేధించేవాడని చెప్పారు. “మొదటి రెండు రోజులు పట్టించుకోలేదు, కానీ మూడవ రోజు వాడు హద్దు దాటి ప్రవర్తించాడు. వాడి ప్రవర్తన నాకు తీవ్ర కోపం తెప్పించింది. ఇలాగే వదిలేస్తే మరింత దారుణంగా ప్రవర్తిస్తాడని గ్రహించి, పక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని తీసి వాడి తలపై గట్టిగా విసిరాను. వాడి తల పగిలి రక్తం కారింది, నేను వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చేసాను” అని ఆమె ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
స్త్రీలందరికీ సందేశం: తప్పు ఎవరైనా, ఎక్కడైనా చేసినా స్త్రీలు మౌనంగా ఉండకూడదని, ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె పిలుపునిచ్చారు. తను ఎదుర్కొన్న వేధింపులను ధైర్యంగా చెప్పడమే కాకుండా, ఆకతాయిని దెబ్బ తీసిన విధానం పట్ల అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు. అన్యాయాన్ని చూసి భయపడకుండా ఇలా పోరాడాలని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
