కోలీవుడ్ స్టార్ నటుడు శివకార్తికేయన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శివకార్తికేయన్ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘పరాశక్తి’ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకుడు సిబి చక్రవర్తి మరియు వెంకట్ ప్రభుల చిత్రాల్లో నటించనున్నారు.
ఈ క్రమంలో, చెన్నైలోని మధ్య కైలాష్ ప్రాంతంలో శివకార్తికేయన్ ప్రయాణిస్తున్న కారు, ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. దీనివల్ల ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు రెండు కార్లను రోడ్డు పక్కకు తరిలించి విచారణ చేపట్టారు.
ఆ సమయంలో శివకార్తికేయన్ కారులో నుంచి బయటకు వచ్చి పోలీసులతో మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదృష్టవశాత్తూ ఇది స్వల్ప ప్రమాదం కావడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
