నడిరోడ్డుపై చెప్పుదెబ్బలు.. “ఇంకెప్పుడైనా ఇలా చేస్తావా?” అని నిలదీసిన యువతి.. వేధించిన ఆకతాయిని వెంటాడి పట్టుకుని బుద్ధి చెప్పిన వైనం, వీడియో వైరల్!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోండా (Gonda) పరిధిలో, ఒక యువతి తనను వేధించిన ఆకతాయిని నడిరోడ్డుపైనే నిలబెట్టి చెప్పుతో చితకబాదిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అక్కడి స్టేషన్ రోడ్డు ప్రాంతంలో సైకిల్‌పై వచ్చిన ఒక యువకుడు, వెళ్తున్న యువతిని చూసి అసభ్యకరమైన మాటలతో వేధింపులకు (ఈవ్-టీజింగ్) దిగాడు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ యువతి.. ఏమాత్రం భయపడకుండా అత్యంత సాహసంతో ఆ యువకుడిని వెంటాడి పట్టుకుంది. అనంతరం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే తన చెప్పు తీసి సదరు ఆకతాయిపై జెట్ స్పీడ్‌తో విరుచుకుపడింది. ఆ యువకుడు చేతులు జోడించి, తప్పు అయిపోయిందని బ్రతిమిలాడుతున్నా వదలకుండా.. “ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేస్తావా?” అంటూ ఆక్రోశంతో నిలదీసి తన నిరసనను వ్యక్తం చేసింది.

పోలీసుల రంగప్రవేశం:
ఈ ఘటనకు సంబంధించిన వీడియో విజువల్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవ్వడంతో.. ఆ యువతి చూపిన ధైర్యసాహసాలను నెటిజన్లు వేనోళ్ల కొనియాడుతున్నారు. కాగా, ఈ వైరల్ వీడియో ఆధారంగా సదరు ఆకతాయిని గుర్తించే పనిలో గోండా పోలీసులు నిమగ్నమయ్యారు.

ఆ యువకుడి గుర్తింపు లభించిన వెంటనే అతనిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీస్ అధికారి మీడియాకు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న ఇలాంటి అనాగరిక అగడాలను ఎదురించి, బుద్ధి చెప్పిన ఈ యువతి చర్యకు ప్రస్తుతం అన్ని వైపుల నుండి ప్రశంసలు, మద్దతు లభిస్తోంది.


Posted

in

by

Tags: