నడిరోడ్డుపై చేతికి బేడీలు.. ఇంగ్లండ్ క్రికెట్ స్టార్‌కు షాక్.. స్తంభం వెనుక దాక్కున్న బెన్ స్టోక్స్..!

ఇంగ్లండ్ క్రికెట్ జట్టులోని ప్రముఖ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్‌ను పోలీసులు చేతులకు బేడీలు వేసి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంగ్లండ్‌లోని డెర్బీ ప్రాంతంలోని ఓ నైట్‌క్లబ్‌ వెలుపల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

డెర్బిషైర్ జట్టుపై కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో డర్హామ్ జట్టు విజయం సాధించిన అనంతరం, ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు బ్రైడన్ కార్స్‌తో పాటు అతని సహచర ఆటగాళ్లు ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లారు. అయితే అక్కడ కొంత గందరగోళం ఏర్పడటంతో ముగ్గురు పోలీసులు కార్స్‌కు చేతులకు బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వైరల్ వీడియోలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా అక్కడే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన ఓ స్తంభం వెనుక నిలబడి ఈ ఘటనను గమనిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే, కార్స్‌ను పోలీసులు కొద్దిసేపు మాత్రమే అదుపులో ఉంచి, ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయకుండానే అనంతరం విడుదల చేసినట్లు సమాచారం.

ఇంగ్లండ్ క్రికెటర్లు మైదానం వెలుపల ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా నైట్‌క్లబ్‌కు సంబంధించిన వివాదాల్లో బెన్ స్టోక్స్ చిక్కుకున్న విషయం తెలిసిందే.

దీంతో ఇంగ్లండ్ క్రికెట్‌లోని ‘నైట్‌క్లబ్ కల్చర్’ మరోసారి తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈ ఘటనను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *