“నన్ను క్షమించండి.. చాలా పెద్ద తప్పు చేసేశాను!”. మహిళల పింక్ బస్సును వెంబడిస్తూ యువకుడి వికృత చేష్టలు.. నెట్టింట వైరల్ వీడియో..!!!

రాచీ: పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో మహిళల కోసం ప్రత్యేకంగా నడుపుతున్న ‘పింక్ బస్’ (Pink Bus) వద్ద బైక్‌పై వచ్చిన ఒక వ్యక్తి, బస్సులోని మహిళా ప్రయాణికులను ఉద్దేశించి అత్యంత అసభ్యకరంగా, వికృతంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఈ ఘోర కలి పాకిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.

కరాచీలోని రషీద్ మిన్హాస్ (Rashid Minhas) రోడ్డుపై మహిళలు మాత్రమే ప్రయాణించే పింక్ బస్సు వెళ్తుండగా.. దానికి సమాంతరంగా ఒక వ్యక్తి తన మోటార్ సైకిల్‌ను నడుపుతూ, బస్సు కిటికీల గుండా లోపల ఉన్న మహిళలకు తన గుప్తాంగాలను చూపిస్తూ అత్యంత అనాగరికంగా ప్రవర్తించాడు.

వీడియో తీసిన ప్రయాణికురాలు – నెటిజన్ల ఆగ్రహం:
ఆ ఆకతాయి చేస్తున్న ఈ అసహ్యకరమైన పనిని బస్సులో ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలు తన మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసింది. ఆ వీడియోను స్థానిక జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు, ఉన్నతాధికారులను ట్యాగ్ చేస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

ప్రజల నుండి వచ్చిన తీవ్ర నిరసనల నేపథ్యంలో సింధ్ ప్రావిన్స్ పోలీసులు (Sindh Police) తక్షణమే రంగంలోకి దిగారు. వీడియోలోని బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా గాలించి, జొరాబాత్ ప్రాంతానికి చెందిన అర్స్లాన్ (Arsalan) అనే ఆ ఉన్మాదిని అరెస్ట్ చేసి జైలు ఊచలు లెక్కపెట్టించారు.

చేతులు జోడించి ఏడ్చిన నిందితుడు:
పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో భయపడిపోయిన నిందితుడు.. చేతులు జోడించి ఏడుస్తూ క్షమాపణలు కోరాడు. “గత జూన్ 19న రషీద్ మిన్హాస్ రోడ్డుపై నేను చేసింది క్షమించరాని పెద్ద తప్పు. మహిళలందరికీ, ప్రజలకు మరియు పోలీసు శాఖకు నేను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. జీవితంలో మరెప్పుడూ ఇలాంటి తప్పు చేయను” అంటూ అతడు ఇచ్చిన వీడియో వాంగ్మూలాన్ని పోలీసులు అధికారికంగా విడుదల చేశారు.

సాధారణ బస్సుల్లో మహిళలపై జరిగే వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ‘పింక్ బస్’ వెలుపల కూడా మహిళలకు ఇలాంటి వికృత పరిస్థితులు ఎదురుకావడం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహిళల భద్రతపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.


Posted

in

by

Tags: