“నన్ను తరచూ పుట్టింటికి పంపించి భర్త చేసిన పని ఇది..!” ఇంట్లో సీసీటీవీ పెట్టి భార్య తీసుకున్న సంచలన నిర్ణయం.. ప్రేమ పెళ్లి చేసుకుని ఇలాగేనా చేసేది..?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తనను తరచూ పుట్టింటికి పంపిస్తున్న భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఓ భార్య, తాను లేనప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రహస్యంగా సీసీటీవీ కెమెరాలను అమర్చింది. అందులో రికార్డయిన దృశ్యాలను చూసి ఆమె దిగ్భ్రాంతికి గురైంది.

దరియాపూర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల మహిళకు, ఆమె భర్తకు 2017లో ప్రేమ వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని, భర్త తనను కొట్టి వేధించేవాడని ఆ మహిళ ఆరోపించింది.

2020లో వారికి ఒక కుమారుడు జన్మించిన తర్వాత కూడా గొడవలు కొనసాగడంతో, భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన ఆమె బాబుతో కలిసి పుట్టింటికి వెళ్లి కోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత బంధువుల మధ్యవర్తిత్వంతో రాజీ కుదరడంతో, కేసును వెనక్కి తీసుకుని మళ్లీ భర్తతో కలిసి కాపురం ప్రారంభించింది.

రాజీ కుదిరిన తర్వాత అహ్మదాబాద్ సరస్‌పూర్ ప్రాంతంలో ఇల్లు కొనుక్కుని నివసిస్తున్నప్పటికీ, ఏదో ఒక సాకు చెప్పి భర్త తనను మళ్లీ మళ్లీ పుట్టింటికి పంపించేవాడని, కొన్నిసార్లు ఇంట్లో ఉండనివ్వకుండా అడ్డుకునేవాడని ఆమె తెలిపింది. దీంతో భర్తపై అనుమానం మరింత బలపడటంతో ఆమె ఇంట్లో సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేసింది.

భార్య పుట్టింటికి వెళ్లిన తర్వాత, భర్త వేరొక మహిళను ఇంట్లోకి తీసుకువచ్చిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *