“నన్ను పెళ్లి చేసుకో లేదంటే చేయి కోసుకుంటా..!” డాబా ఎక్కి 21 ఏళ్ల యువతి బెదిరింపు.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు.. మోసం చేసిన ప్రియుడి ఇంటిని ముట్టడించిన వైరల్ వీడియో..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుషీనగర్ (Kushinagar) జిల్లాలో, తనను పెళ్లి చేసుకోకపోతే చేయి కోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ, ప్రియుడి ఇంటి పైకప్పు (డాబా) ఎక్కి 21 ఏళ్ల యువతి సృష్టించిన హైడ్రామా తీవ్ర కలకలం రేపింది.

హటా (Hata) ప్రాంతానికి చెందిన ఆ యువతి, రెండేళ్ల క్రితం గోపాల్ అనే యువకుడిని కలిసి ప్రేమించడం ప్రారంభించింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి గోపాల్ తనతో చనువుగా మెలిగాడని ఆ యువతి తెలిపింది.

కానీ, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినప్పుడు గోపాల్ దూరం జరిగేందుకు ప్రయత్నించడంతో, అతనిపై లైంగిక దాడి ఫిర్యాదు చేసిన ఆ యువతి.. శనివారం రోజున ప్రియుడి ఇంట్లోకి చొరబడి డాబా ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగింది.

‘నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే చేయి కోసుకుని ప్రాణాలు తీసుకుంటా’ అని ఆ యువతి పైకప్పు పైనుంచి కేకలు వేయడంతో, ఇంటి ముందు భారీగా జనం గుమిగూడి ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత, కలకలం చోటుచేసుకుంది.

సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు, పలు గంటల పాటు శ్రమించి ఆమెకు నచ్చజెప్పి, శాంతింపజేసి సురక్షితంగా కిందకు దించారు. ప్రస్తుతం వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై ముమ్మరంగా విచారిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *