నన్నే ప్రేమించు చిన్నా, లేదంటే చచ్చిపోతా – ఇన్స్‌పెక్టర్‌ను వేధిస్తున్న కాంగ్రెస్ కార్యకర్త!

బెంగళూరు: ఒక కాంగ్రెస్ కార్యకర్త ఇన్స్‌పెక్టర్ వెనకాల పడి, తనను ప్రేమించాలంటూ చిత్రహింసలకు గురిచేస్తూ, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్న ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. రామమూర్తినగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ సతీష్ ఈ వేధింపులకు గురవ్వగా, సంజన అలియాస్ వనజ అనే మహిళపై ఫిర్యాదు నమోదైంది.

ఘటన వివరాలు: “నన్ను ప్రేమించాలి, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను” అంటూ సంజన ప్రతిరోజూ వేర్వేరు ఫోన్ నంబర్ల నుండి ఇన్స్‌పెక్టర్‌కు మెసేజ్‌లు పంపేది. ఆమె వేధింపులు భరించలేక ఇన్స్‌పెక్టర్ సతీష్ ఆమె వాడుతున్న సుమారు 11 ఫోన్ నంబర్లను బ్లాక్ చేశారు. నంబర్లు బ్లాక్ చేయడంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వనజ, ఒక లవ్ లెటర్ ఇచ్చి, తనను ప్రేమించకపోతే చనిపోతానని బెదిరించింది.

తాను కాంగ్రెస్ కార్యకర్తనని, తనకు సీఎం, డిప్యూటీ సీఎం తెలుసని ఆమె బెదిరింపులకు దిగింది. అంతేకాకుండా మోటమ్మ, లక్ష్మీ హెబ్బాల్కర్ వంటి నాయకులతో దిగిన ఫోటోలను పంపి తనను ప్రేమించమని ఒత్తిడి తెచ్చింది. ఆమె ప్రభావం వల్ల హోం మంత్రి కార్యాలయం నుండి కూడా “ఆ మహిళ ఫిర్యాదును స్వీకరించండి” అని ఇన్స్‌పెక్టర్‌కు ఫోన్ వచ్చింది. అయితే ఆమె ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని సతీష్ సమాధానం ఇచ్చారు.

ఇన్‌స్పెక్టర్ స్టేషన్‌లో లేని సమయంలో మిఠాయిల డబ్బా, పూల బొకేలతో పాటు ‘Nexito Plus’ అనే మాత్రలను కూడా అక్కడ పెట్టింది. “నా ప్రేమను మీరు అంగీకరించడం లేదు, మీకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేదు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా సావుకు మీరే కారణం” అని రాసి, గుండె బొమ్మ గీసి, రక్తం తో “Chinni love u, u love me” అని లేఖ రాసింది.

ఈమె వేధింపులు తట్టుకోలేక చివరకు ఇన్స్‌పెక్టర్ సతీష్ స్వయంగా ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య బెదిరింపులు మరియు విధి నిర్వహణకు అభ్యంతరం కలిగించినందుకు గానూ రామమూర్తినగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.


Posted

in

by

Tags: