బీహార్ రాష్ట్రంలో ఒక భర్త.. పంచాయతీ మరియు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో తన భార్యకు ఆమె ప్రియుడితో అధికారికంగా వివాహం జరిపించిన విచిత్ర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
స్నేహితుడితో వివాహేతర సంబంధం:
బగువారా పట్టి గ్రామానికి చెందిన అనూప్ రామ్‌కు, జ్యోతి దేవి అనే మహిళతో గత 2011లో వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. అనూప్ రామ్ వ్యాపారం, ఆస్తులు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ (Asansol) ప్రాంతంలో ఉండటంతో, అతను తన భార్యాపిల్లలతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు.
ఈ క్రమంలో భర్త అనూప్ స్నేహితుడైన సుజిత్ దాస్‌తో జ్యోతి దేవికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కాలక్రమేణా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇటీవలి కాలంలో సుజిత్ దాస్ తరచూ అనూప్ ఇంటికి వస్తుండటంతో, వీరి వ్యవహారం కుటుంబ సభ్యులకు మరియు గ్రామస్థులకు తెలిసింది.
గుడిలో జరిగిన రెండో పెళ్లి
ఈ విషయమై గ్రామంలో గత మూడు రోజులుగా పలుమార్లు పంచాయతీ నిర్వహించి, జ్యోతి దేవికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, భర్తతో కలిసి జీవించడానికి నిరాకరించిన జ్యోతి, తన ప్రియుడు సుజిత్తోనే ఉంటానని భీష్మించుకు కూర్చుంది. భార్య పట్టుదలను చూసి, ఇక చేసేదేమీ లేక భర్త అనూప్.. పంచాయతీ పెద్దలు మరియు ఇరు కుటుంబాల సమ్మతితో శుక్రవారం నాడు బగువారా పట్టి దేవి ఆలయంలో జ్యోతి దేవికి, ఆమె ప్రియుడు సుజిత్‌కు అధికారికంగా వివాహం జరిపించాడు.
కన్నతల్లి చెప్పు దెబ్బలు:
అయితే, ఈ పెళ్లి జరుగుతున్న సమయంలో కల్యాణ మండపంలోనే ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది. తన కూతురి ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం చెందిన జ్యోతి తల్లి, ఆలయ ప్రాంగణంలోనే అందరి ముందూ కూతురు జ్యోతిని, ఆమె కొత్త భర్త సుజిత్‌ను చెప్పుతో కొట్టి తన ఆవేదనను, కోపాన్ని వెళ్లగక్కింది. దీనితో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పిల్లల విషయంలో పేచీ
పెళ్లి ముగిసిన తర్వాత, తన నలుగురు పిల్లలలో ఇద్దరిని తనతో తీసుకెళ్తానని జ్యోతి కోరింది. “నలుగురూ నా పిల్లలే, కానీ ప్రస్తుతానికి ఇద్దరు చాలు” అని ఆమె అంది. కానీ, అందుకు పంచాయతీ పెద్దలు, అనూప్ కుటుంబ సభ్యులు తెగేసి చెప్పారు. నలుగురు పిల్లల బాధ్యతను తండ్రి అనూప్ రామ్‌కే అప్పగించారు. ఆ తర్వాత జ్యోతి దేవి తన కొత్త భర్తతో కలిసి అక్కడి నుండి వెళ్లిపోయింది.
ఈ ఘటనపై స్థానిక మాజీ సర్పంచ్ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, “గత మూడు రోజులుగా పంచాయతీ ద్వారా నచ్చజెప్పి సర్దుబాటు చేయడానికి ప్రయత్నించాము. కానీ ఆ మహిళ తన నిర్ణయానికి కట్టుబడి ఉండటంతో, అందరి సమక్షంలో ఈ వివాహం జరిపించాల్సి వచ్చింది” అని తెలిపారు. ఒక సినిమా కథను తలపించేలా జరిగిన ఈ పెళ్లి ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
