“నాకే తెలియకుండా ఇలా చేశాడు. మత్తు మందు ఇచ్చి ప్రకృతి విరుద్ధమైన లైంగిక దాడి. పైగా కారు కావాలట, మెడికల్ షాప్ పెట్టాలట. అత్తింటివారి టార్చర్. మహిళ ఆవేదన.!”

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బందా (Banda) జిల్లాలో, తన భర్త మరియు అత్తింటివారిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఒక మహిళ జిల్లా ఎస్పీ (Superintendent of Police) కి ఫిర్యాదు చేసింది.

తనకు మత్తు బిల్లలు ఇచ్చి తన భర్త ప్రకృతి విరుద్ధమైన లైంగిక దాడికి (Unnatural sex) పాల్పడ్డాడని, దాన్ని ఎదిరించినందుకు తీవ్రంగా కొట్టాడని ఆమె తెలిపింది.

బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం, గత 2025 డిసెంబర్‌లో ఆమెకు వివాహం జరిగింది. తల్లిదండ్రులు తమకు తోచినంత కట్నం ఇచ్చి పెళ్లి చేసినప్పటికీ, పెళ్లయిన కొద్ది రోజులకే అత్తింటివారు కట్నం సరిపోలేదంటూ వేధించడం మొదలుపెట్టారు.

అంతేకాకుండా, అదనంగా ఒక కొత్త కారు మరియు మెడికల్ స్టోర్ పెట్టుకోవడానికి డబ్బులు కావాలని డిమాండ్ చేస్తూ మానసికంగా, శారీరకంగా తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. ఈ క్రమంలో భర్త ఆగడాలపై పలుమార్లు పంచాయితీ పెట్టి మాట్లాడినప్పటికీ వారి తీరులో ఎలాంటి మార్పు రాలేదు. చివరకు వివాదం ముదరడంతో, భర్త ఆ మహిళకు ‘ట్రిపుల్ తలాక్’ (Triple Talaq) చెప్పి ఇంటి నుంచి గెంటేశాడు.

బాధిత మహిళ ఎస్పీని స్వయంగా కలిసి తనకు జరిగిన ఘోరాన్ని వివరించి, న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ, వెంటనే కేసు నమోదు చేయాలని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. దీంతో మహిళా పోలీస్ స్టేషన్ అధికారిణి మోని నిషాద్ ఆధ్వర్యంలో, నిందితుడైన భర్తతో సహా కుటుంబానికి చెందిన ఐదుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కట్నపు వేధింపులు, దాడి మరియు ట్రిపుల్ తలాక్ ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *