గుజరాత్ రాష్ట్రం బరూచ్ జిల్లాలో, తల్లి అక్రమ సంబంధానికి నిరాకరించడంతో కక్ష పెంచుకున్న భర్త స్నేహితుడు.. పగ తీర్చుకునే క్రమంలో రెండేళ్ల పసికందుపై లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
బాధిత చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, భర్త స్నేహితుడైన 28 ఏళ్ల సురేంద్రకుమార్ తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆ మహిళను నిరంతరం వేధిస్తూ వచ్చాడు.
ఆ మహిళ అందుకు కరాఖండిగా నిరాకరించడంతో ఆగ్రహానికి లోనైన సురేంద్రకుమార్, ఫోన్ ద్వారా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు. అనంతరం తల్లిపై పగ తీర్చుకోవడానికి ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఆమె రెండేళ్ల కుమార్తెను లక్ష్యంగా చేసుకున్న ఆ దుర్మార్గుడు, చాక్లెట్ ఆశ చూపి చిన్నారిని తన గదిలోకి తీసుకెళ్లి క్రూరంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ పైశాచిక దాడితో ఆ పసికందు ప్రైవేట్ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి నరకయాతన పడుతుండటాన్ని చూసి కంగారుపడిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు జరిగిన దారుణాన్ని తెలుసుకుని వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు సురేంద్రకుమార్ను అరెస్ట్ చేశారు. అనంతరం బరూచ్ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచిన అతడిని కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Leave a Reply