“నాన్నకు ఏమైంది..?” రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య.. కొద్ది గంటల్లోనే కారులో ఇద్దరు కుమారుల శవాలు..! వీడని మిస్టరీ..?!

మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్మదాపురం జిల్లాలో పట్వారీగా (రెవెన్యూ ఉద్యోగి) పనిచేస్తున్న అజయ్ ధాకర్ అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే, రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో లాక్ చేసి ఉన్న కారులో ఆయన ఇద్దరు కుమారులు విగతజీవులుగా లభ్యమయ్యారు. ఒకే రోజు తండ్రీ, ఇద్దరు కొడుకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా పెను కలకలం రేపింది.

ఆదివారం మధ్యాహ్నం పిపరియా రైల్వే స్టేషన్ సమీపంలో వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలు కిందకు అజయ్ దూకడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం అదే రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో నిలిపి ఉంచిన కారు లోపల ఆయన కుమారులు శివం, సమర్థ్‌లు శవాలుగా పడి ఉండటాన్ని గుర్తించారు. వీరిద్దరూ వరుసగా 6వ తరగతి, 9వ తరగతి చదువుతున్నారని సమాచారం.

ఆ బాలుర మెడపై గాయాల ఆనవాళ్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో, వారి మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే వారి మృతికి గల అసలు కారణం స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా, పిల్లలను సినిమాకు తీసుకెళ్తానని చెప్పి అజయ్ వారిని పిపరియాకు తీసుకువచ్చాడని బంధువు ప్రతాప్ సింగ్ ధాకర్ తెలిపారు.

తండ్రి మృతికి, ఆ ఇద్దరు చిన్నారుల మరణానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఆ పిల్లలు ఎలా చనిపోయారు? అసలేం జరిగింది? అనే విషయాలపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతికి గల కారణాలు ఇంకా పూర్తిగా బయటపడకపోవడంతో, పోస్ట్‌మార్టం నివేదిక మరియు పోలీసు విచారణ ఈ కేసులో అత్యంత కీలకంగా మారాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *