“నాన్నా.. దయచేసి అమ్మను వదిలేయ్ నాన్నా..!” పిల్లలు రోదించినా కనికరం లేకుండా భార్యను చంపిన భర్త.. 6 నెలలు జైలుకు వెళ్లినా బుద్ధి రాలేదు.. మళ్లీ ఘాతుకానికి పాల్పడిన మద్యం బానిస.. సంచలన ఘటన..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇటావా (Etawah) జిల్లాలో కన్న భార్యను దారుణంగా హత్య చేసి పరారీలో ఉన్న భర్తపై రూ. 25 వేల రివార్డు ప్రకటించి తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు, తాజాగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

గత నవంబర్ 1వ తేదీ రాత్రి, ఇటావా జిల్లాలోని పహ్లాన్ గ్రామానికి చెందిన శివపూజన్ సింగ్ అనే వ్యక్తి, తన భార్య అవధేష్ కుమారిని కొత్తగా వంట చేయమని చెప్పి గొడవకు దిగాడు.

మద్యం మత్తులో ఉన్న శివపూజన్ భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు ఆమె గొంతు నులిమాడు. ఆ సమయంలో “నాన్నా, అమ్మను వదిలేయ్” అని పెద్ద కూతురు ఎంతగా రోదించినా కనికరించకుండా, పిల్లలను కాలితో తన్ని పక్కకు నెట్టేసి భార్యను దారుణంగా హత్య చేశాడు.

హత్యకు గురైన మహిళ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడు శివపూజన్ సింగ్‌ను పట్టుకునేందుకు ఇటావా ఎస్పీ రూ. 25,000 రివార్డు ప్రకటించారు.

తాజాగా మహువాసుడా (Mahuasuda) ప్రాంతం సమీపంలో పారిపోయేందుకు యత్నించిన శివపూజన్ సింగ్‌ను ప్రత్యేక పోలీసు బృందం వలపన్ని పట్టుకుని జైలుకు తరలించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *