“నా కుర్తా లోపలి నుండి అతని చేయి నా తొడపైకి..”: ‘నేను ఠాకూర్ ని’ అంటూ వైరలైన యువతి వీడియో, “మీ కూతుళ్లను బుర్ఖాల్లో దాచుకుంటారు కానీ..” అంటూ సంచలన వ్యాఖ్యలు!

సోషల్ మీడియాలో ‘ఠాకూర్ గర్ల్’గా వైరలైన కాన్పూర్‌కు చెందిన యువతి, తాజాగా మరో వీడియోతో వార్తల్లో నిలిచింది. ఈ వీడియోలో ఆమె తనపై జరిగిన వేధింపుల గురించి వివరిస్తూ, ఒక ఈ-రిక్షాలో ప్రయాణిస్తున్నప్పుడు తన పక్కన కూర్చున్న ముస్లిం యువకుడు తనను అసభ్యంగా తాకాడని ఆరోపించింది.

ఆమె ఏమంటోంది? ఆ యువతి తన వీడియోలో ఇలా పేర్కొంది: “నేను నా బ్యాంక్ బ్రాంచ్ నుండి మెట్రో స్టేషన్ వెళ్లేందుకు ఈ-రిక్షా ఎక్కాను. నా పక్కన ఒక ఆంటీ, నా ముందు ఒక వ్యక్తి కూర్చున్నారు. మొదట నేను గమనించలేదు, కానీ ఆ వ్యక్తి కాలు నా కాళ్ల మధ్యలోకి రావడంతో అనుమానం వచ్చింది. పది సెకన్ల తర్వాత అతని చేయి నా శరీర భాగాన్ని తాకినట్లు అనిపించింది. అకస్మాత్తుగా అతని చేయి నా కుర్తా లోపలి నుండి తొడ (thigh) వరకు వెళ్ళింది. వెంటనే నేను అతడిని పక్కకు తోసేసి, గట్టిగా కొట్టాను.”

‘ముస్లింల పట్ల విమర్శలు’: అక్కడి ప్రాంతం ముస్లింలు ఎక్కువగా ఉండే చోటు కావడంతో తాను అంతకు మించి ఏమీ చేయలేకపోయానని ఆమె చెప్పింది. వేధింపులకు పాల్పడిన వ్యక్తి, తన తప్పును ఒప్పుకోకుండా, “నీకు ఎలా కూర్చోవాలో తెలియడం లేదు” అని తిరిగి తననే విమర్శించాడని ఆమె ఆరోపించింది.

ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి: “వీళ్లు తమ ఇంటి మహిళలను బుర్ఖాల్లో ఉంచి, బయట ప్రపంచానికి కనిపించకుండా జాగ్రత్త పడతారు. కానీ, ఇతరుల ఇంటి మహిళల గౌరవాన్ని మాత్రం పణంగా పెడతారు. మనం ‘భాయీ-భాయీ’ అంటూ తిరుగుతున్నాం, ఇది మనకు అవమానం. ఇప్పటికైనా మేల్కొండి, మన అస్తిత్వాన్ని కాపాడుకోండి” అని ఆమె సదరు వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేసింది.


Posted

in

by

Tags: