తల్లిదండ్రులకు తమ పిల్లల భవిష్యత్తుపై కొన్ని సాంప్రదాయకమైన అంచనాలు, ఆశలు ఉండటం సహజం. కానీ, ఓ హాలీవుడ్ నటి తన కొడుకు గురించి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
అమెరికన్ నటి క్యామరూన్ మాన్హీమ్ (Camryn Manheim) ఇటీవల పాల్గొన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన కొడుకు ‘గే’ (స్వలింగ సంపర్కుడు) లేదా ట్రాన్స్‌జెండర్‌గా (LGBTQ+ కమ్యూనిటీకి చెందినవాడిగా) ఉండాలని తాను తీవ్రంగా కోరుకున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
తల్లులకు, అటువంటి ప్రత్యేక లింగ గుర్తింపు (క్వీర్/గే) ఉన్న కొడుకులకు మధ్య బంధం చాలా అందంగా, దృఢంగా ఉంటుందని తాను నమ్మినట్లు క్యామరూన్ తెలిపారు. ఆ కోరికతోనే, తన కొడుకు చిన్నతనంలో ఉన్నప్పుడు వాడికి అమ్మాయిల లాగా హై హీల్స్ (ఎత్తు మడమల చెప్పులు) తొడిగి మురిసిపోయేదాన్నని, ఆ ఫోటోలను కూడా తీసి దాచుకున్నానని ఆమె అంగీకరించారు.
తన కొడుకు కచ్చితంగా అలాగే మారతాడని ఆమె బలంగా నమ్మారు. కానీ, ఆమె ఊహించిన దానికి పూర్తి భిన్నంగా జరిగింది. క్యామరూన్ కుమారుడు ఓ మ్యూజికల్ థియేటర్ గ్రూపులో (సంగీత నాటక బృందం) చేరినప్పుడు, ఆ మొత్తం బృందంలో సాధారణ పురుషుడిగా (Straight) ఉన్న ఏకైక వ్యక్తి తన కొడుకు మాత్రమేనని తేలింది. దీంతో తన చిరకాల కోరిక నెరవేరకుండా పోయిందని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, తన స్నేహితురాలు, ప్రముఖ నటి మార్షియా గే హార్డెన్ (Marcia Gay Harden) పిల్లలు LGBTQ+ కమ్యూనిటీకి చెందినవారని ప్రస్తావిస్తూ.. ఆ విషయంలో ఆమెను చూసి తాను అసూయపడ్డానని కూడా క్యామరూన్ వేదికపై వెల్లడించారు.
క్యామరూన్ మాన్హీమ్ చేసిన ఈ వింత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారితీశాయి. తల్లిదండ్రులు తమ వ్యక్తిగత ఇష్టాలను, అభిప్రాయాలను పిల్లలపై ఎలాంటి పరిస్థితుల్లోనూ రుద్దకూడదని పలువురు ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఎంత ఆధునిక ఆలోచన అయినప్పటికీ, పిల్లలపై తల్లిదండ్రులు ఇలా తమ

Leave a Reply