“నా జీవితానికి ఇదే శాపమా..?” పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చినందుకు 100 కొరడా దెబ్బలు.. సౌదీ కోర్టు తీర్పుతో ఉలిక్కిపడిన మానవ హక్కుల కార్యకర్తలు.. పురుషులకు ఏమీ లేదు, కేవలం మహిళలకే కొరడా దెబ్బలా..??

సౌదీ అరేబియాలో వివాహం కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన కెన్యా దేశానికి చెందిన ఒక మహిళకు, అక్కడి న్యాయస్థానం 100 కొరడా దెబ్బల శిక్షతో పాటు ఏడాది పాటు దేశ బహిష్కరణ విధిస్తూ తీర్పునివ్వడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

కెన్యాకు చెందిన ఎస్తేర్ వాంజా ముథోని (Esther Wanja Muthoni) అనే మహిళ సౌదీ అరేబియాలో గృహ కార్మికురాలిగా (పనిమనిషిగా) పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. అక్కడ ఒక విదేశీ వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఆమె గర్భం దాల్చింది. అనంతరం గత ఏడాది ఆగస్టు నెలలో తాను పనిచేస్తున్న చోటే ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

ఆ బిడ్డకు తండ్రయిన వ్యక్తి దేశం విడిచి పారిపోగా, ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఎస్తేర్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమెను విడుదల చేసినప్పటికీ, ఎక్కడా ఆశ్రయం దొరకక, ఉంటున్న ఇంటి నుంచి బయటకు పంపివేయబడటంతో ఒక పెట్రోల్ బంక్ సమీపంలోనే తలదాచుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.

ఈ కేసును విచారించిన సౌదీ న్యాయస్థానం, ఇస్లామిక్ చట్టాల ప్రకారం వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే కారణంతో ఎస్తేర్‌కు 100 కొరడా దెబ్బల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, ఈ ఘటనకు ప్రధాన కారణమైన బిడ్డ తండ్రిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే పేద మహిళా కార్మికుల భద్రత మరియు అక్కడ అమలవుతున్న కఠినమైన చట్టపరమైన నిబంధనలపై ఈ ఘటన మానవ హక్కుల కార్యకర్తలలో పలు ప్రశ్నలను రేకెత్తించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *