“నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేశాడు!”.. వివాహేతర సంబంధం తెచ్చిన కక్ష.. రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న భర్త!.. వెన్నులో వణుకు పుట్టించే ఘోరం..!!!

మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్సింగ్‌పూర్ జిల్లాలో కుటుంబ సంబంధాల హద్దులు దాటి నడిచిన ఓ వివాహేతర సంబంధం.. చివరకు దారుణ హత్యకు దారితీసి ఆ ప్రాంతం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

వీరేంద్ర అనే వ్యక్తికి, అతని భార్య చెల్లెలికి (మరదలికి) మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది.

ఈ అక్రమ సంబంధం ముదరడంతో, సుమారు ఏడు నెలల క్రితం ఆ మహిళ తన భర్తను, కుటుంబాన్ని వదిలేసి ప్రియుడైన వీరేంద్రతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే, రోజులు గడిచేకొద్దీ తన పిల్లల భవిష్యత్తు, కుటుంబ పరువు, సమాజంలో తమ స్థాయిని దృష్టిలో ఉంచుకుని మనసు మార్చుకున్న ఆమె.. వీరేంద్రను విడిచిపెట్టి తిరిగి తన భర్త వద్దకే వచ్చేసింది.

కానీ, తనను వదిలేసి మరదలు తిరిగి తన భర్తతో కలిసి జీవించడాన్ని వీరేంద్ర జీర్ణించుకోలేకపోయాడు. ప్రియురాలు చేజారిపోయిందన్న ఆక్రోశం, ఆమె భర్తపై పెంచుకున్న పగ వీరేంద్ర మనసులో తీవ్రమైన కక్షగా మారాయి.

దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న మరదలి భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని వాడు ఓ కిరాతక పథకం వేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం ఒక మైనర్ బాలుడిని తనతో కలుపుకున్న వీరేంద్ర.. నమ్మకంగా బాధితుడిని తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని, నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అక్కడికి చేరుకోగానే ఇద్దరూ కలిసి ఆ వ్యక్తిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతడు ఘటనా స్థలంలోనే రక్తపు మడుగులో కుప్పకూలిపోగా.. క్రూరత్వానికి పరాకాష్టగా పొట్టలోనే కత్తిని గుచ్చి వదిలేసి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘటనపై తీవ్రస్థాయిలో దర్యాప్తు చేపట్టిన నర్సింగ్‌పూర్ పోలీసులు.. ప్రధాన నిందితుడు వీరేంద్రతో పాటు అతనికి సహకరించిన బాలుడిని అరెస్ట్ చేసి, సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.


Posted

in

by

Tags: