భారత క్రికెటర్ డీపక్ చాహర్‌కు చెందిన మూడు ఖరీదైన క్రికెట్ బ్యాట్లు ట్రైనింగ్ గ్రౌండ్ నుంచి కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ బ్యాట్ల విలువ రూ.1.50 లక్షలకు పైగా ఉంటుందని చాహర్ తెలిపారు.
ఆగ్రాకు చెందిన డీపక్ చాహర్ అక్కడి శాస్త్రిపురం మైదానంలో క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆయన సోషల్ మీడియాలో సుమారు 45 సెకన్ల వీడియోను పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో తనకు చెందిన ‘ప్లేయర్ ఎడిషన్’కు చెందిన మూడు ఖరీదైన బ్యాట్లు ప్రాక్టీస్ మైదానం నుంచి మాయమైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
“ఆ బ్యాట్ల విలువ ఎంత ఉంటుందో తీసుకెళ్లిన వ్యక్తికి తెలియకపోవచ్చు. సుమారు రూ.1.50 లక్షల విలువైన ఈ బ్యాట్లను తీసుకెళ్లి ఏం చేస్తారో అర్థం కావడం లేదు. టెన్నిస్ బాల్‌తో ఆడతారో.. లేక ఎవరికైనా అమ్ముతారో తెలియదు. నిజంగా బ్యాట్ కావాలంటే నన్నే అడిగి ఉంటే.. నేనే డబ్బులు ఇచ్చేవాడిని” అని చాహర్ అన్నారు.
అంతేకాదు.. తన బ్యాట్లు తిరిగి రావడానికి ఏం చేయాలో తెలియడం లేదంటూ ఆయన సరదాగా ప్రశ్నించారు.
“ఇప్పుడు నేను ఏం చేయాలి? పోలీసులకు ఫిర్యాదు చేయాలా? యోగి జీకి చెప్పాలా? మోదీ జీకి చెప్పాలా? లేక బ్యాట్లు తీసుకెళ్లిన వ్యక్తికి మంచి బుద్ధి వచ్చి వాటిని తిరిగి ఇచ్చేలా చేయమని దేవుడిని ప్రార్థించాలా? లేక ఎస్‌ఎస్ సంస్థతో మాట్లాడి కొత్త బ్యాట్లు తెప్పించుకోవాలా? నేను ఏం చేయాలో మీరే చెప్పండి” అంటూ అభిమానులను అడిగారు.
తనకు జరిగిన నష్టంపై ఆవేదన వ్యక్తం చేస్తూనే.. డీపక్ చాహర్ సరదాగా చేసిన ఈ విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోకు తక్కువ సమయంలోనే భారీగా వ్యూస్ వచ్చినట్లు కథనం పేర్కొంది.
ఖరీదైన క్రికెట్ బ్యాట్లు మైదానం నుంచి మాయమవడం ఒకవైపు చర్చనీయాంశంగా మారితే.. ఈ ఘటనపై చాహర్ స్పందించిన తీరు మరోవైపు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Leave a Reply