కుక్క కేవలం మనిషికే కాదు, తన తోటి స్నేహితులకు కూడా ఎంతో విశ్వాసపాత్రమైన జంతువు అని నిరూపించే ఒక హృదయాన్ని హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో, వీధి కుక్కలను పట్టే ‘డాగ్ క్యాచర్’ ఒక కుక్కపై వల విసిరి, దాన్ని పట్టుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. తన స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడని గ్రహించిన మరో కుక్క, ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే రంగంలోకి దిగింది.
తన స్నేహితుడిని కాపాడేందుకు తెగించిన ఆ కుక్క, డాగ్ క్యాచర్ వైపు ఆవేశంగా అరుచుకుంటూ పరుగెత్తుకొచ్చి అతనిపైకి దూకింది. అతని కాలు కరిచేందుకు ప్రయత్నించి, తన స్నేహితుడిని వదిలేసి వెళ్లిపోవాలని అతడిని భయపెట్టింది.
స్నేహితుడి కోసం ఆ కుక్క కనబరిచిన ధైర్యం, దాని ప్రాణప్రదమైన స్నేహం నెటిజన్ల మనసులను హత్తుకుంటోంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడి లక్షలాది వ్యూస్ రాబడుతోంది.
“మనిషి కంటే కుక్కకే స్నేహం విలువ బాగా తెలుసు!”, “నా స్నేహితుడిని ముట్టుకుంటే నిన్ను వదిలిపెట్టను!” అంటూ నెటిజన్లు పలువురు ఆ కుక్క నిజమైన స్నేహాన్ని ప్రశంసిస్తూ భావోద్వేగంగా కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply