రైల్వేలో అత్యధిక ఛార్జీలు వసూలు చేసే ఫస్ట్ ఏసీ కోచ్‌లో ఒక భయంకరమైన భద్రతా లోపాన్ని ట్రావెల్ వ్లాగర్ దీపక్ వేది వెలుగులోకి తెచ్చారు.
వీడియోలో ఏముంది?
ఆ వీడియోలో ఆయన తన కేబిన్ తలుపు తీయగానే, అది ఎటువంటి రక్షణ కవచం లేదా సేఫ్టీ లాక్ లేకుండా నేరుగా రైలు బయట ఉండే వాకిలి (Exit door) వైపునకు తీసుకెళ్లింది.
- ప్రమాదం: పొరపాటున ఎవరైనా నిద్రమత్తులో లేదా అజాగ్రత్తగా ఆ తలుపు తోస్తే, వారు నేరుగా నడుస్తున్న రైలులో నుండి బయట పడిపోయే అవకాశం ఉందని ఆయన వివరించారు.
- వ్లాగర్ ఆవేదన: “రైల్వే ప్రాణాలు తీసే వరకు వదలదా? ఇంత ఖరీదైన టికెట్ కొన్నాక కూడా ఇలాంటి నిర్లక్ష్యం ఉంటే బాధ్యులు ఎవరు?” అని ఆయన ప్రశ్నించారు.
నెటిజన్ల చర్చ – రైల్వే స్పందన:
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య పెద్ద చర్చ మొదలైంది. కొందరు ఇది రైల్వే నిర్లక్ష్యమని తిట్టిపోస్తుంటే, మరికొందరు మాత్రం “ఇది పాత కోచ్ మోడల్, తలుపులు రెండు వైపులా తెరుచుకుంటాయి” అని వ్లాగర్‌ను విమర్శిస్తున్నారు. దీనిపై రైల్వే సేవా (Railway Seva) స్పందిస్తూ.. సదరు ప్రయాణికుడు తన రైలు నంబర్ మరియు ప్రయాణ వివరాలను పంపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
