“నిన్ను ఊరికే వదలను.” భార్య పనిచేసే చోటికే ఇనుప రాడ్‌తో వచ్చిన భర్త. భార్య తలపై విచక్షణారహితంగా దాడి. జనం పరుగెత్తుకు రావడంతో భర్త చేసిన షాకింగ్ పని. ఉలిక్కిపడేలా చేసిన ఘటన.!!!

కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలోని కుజితోలు ప్రాంతంలో, భార్య పనిచేస్తున్న పోస్టాఫీసుకే ఇనుప రాడ్‌తో వచ్చిన భర్త.. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భార్యపై దాడి చేసిన అనంతరం ఆ భర్త తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. 42 ఏళ్ల సంతోష్, 35 ఏళ్ల శ్రీజల మధ్య గత రెండేళ్లుగా కుటుంబ కలహాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా విడాకుల ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఈ క్రమంలో, శుక్రవారం ఉదయం శ్రీజ ఎప్పటిలాగే పోస్టాఫీసుకు డ్యూటీకి వెళ్లింది. ఆ తర్వాత ఇనుప రాడ్‌తో అక్కడికి చేరుకున్న సంతోష్, భార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు.

వాగ్వాదం ముదరడంతో సంతోష్ తాను తెచ్చిన ఇనుప రాడ్‌తో శ్రీజ తలపై ఇష్టానుసారంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె హాహాకారాలు చేసింది. ఆమె అరుపులు విని చుట్టుపక్కల వారు వెంటనే పరుగెత్తుకుని వచ్చి చూడగా, శ్రీజ రక్తపు మడుగులో పడి ఉంది. ఇంతలో జనం రావడాన్ని గమనించిన సంతోష్ పోస్టాఫీసు నుంచి బయటకు వచ్చాడు. ఆ వెంటనే తన వద్ద ఉన్న పిస్తోలుతో తన తలపై కాల్చుకున్నాడు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.

తీవ్రంగా గాయపడిన శ్రీజను స్థానికులు వెంటనే రక్షించి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూ (ICU)లో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, సంతోష్ ఉపయోగించిన తుపాకీకి లైసెన్స్ లేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అతనికి ఆ తుపాకీ ఎలా దొరికింది?, ఈ ఘటనలో ఇంకెవరికైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: