హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ సెక్టార్ 5 ప్రాంతంలో అత్యంత అమానవీయంగా జరిగిన ఓ దారుణ ఘటన సోషల్ మీడియాలో వెలుగుచూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
రోడ్డుపై వెళ్తున్న ఓ సైకిల్ అనుకోకుండా బస్సు కింద ఇరుక్కుపోయింది. అది గమనించినప్పటికీ, డ్రైవర్ బస్సును ఆపకుండా అలాగే వేగంగా ముందుకు పోనిచ్చాడు.
బస్సు కింద చిక్కుకున్న సైకిల్ రోడ్డుకు రాసుకుంటూ నిప్పురవ్వలు ఎగిసిపడుతుండగా పలు మీటర్ల దూరం అలాగే ఈడ్చుకెళ్లాడు. బస్సు డ్రైవర్ చేసిన ఈ నిర్లక్ష్యపు చర్య చూసేవారిని వణికించింది.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, అతడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని సమాచారం. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికుడు ఈ భయానక దృశ్యాన్ని తన మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఏమాత్రం తేడా వచ్చినా నిండు ప్రాణం పోయేది. సాటి మనుషుల ప్రాణాలంటే ఏమాత్రం లెక్కలేకుండా ఇంత బాధ్యతారాహిత్యంగా బస్సును నడిపిన ఆ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంటర్నెట్‌లో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

Leave a Reply