ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు, ఐపీఎల్ టోర్నీలో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్న కూపర్ కొన్నోలీ, సోషల్ మీడియాలో విడుదలైన ఒక వీడియోతో వివాదంలో చిక్కుకున్నాడు.
ఓన్లీఫ్యాన్స్ క్రియేటర్ ఆనీ నైట్ విడుదల చేసిన ఒక వీడియోలో, చాలామంది ఆస్ట్రేలియన్ క్రీడాకారులు తనకు పంపినట్లు చెబుతున్న వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ మెసేజ్లను పంచుకుంది. ఆ జాబితాలో కూపర్ కొన్నోలీ పేరు కూడా చోటు చేసుకుంది.
ఆనీ నైట్ విడుదల చేసిన వీడియోలో, వివిధ క్రీడాకారుల పేర్లను, వారు పంపినట్లు చెబుతున్న మెసేజ్ స్క్రీన్షాట్లను చూపించింది. ఇందులో ఎక్కువ మంది ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ లీగ్ ఆటగాళ్లని, క్రికెటర్లలో కూపర్ కొన్నోలీ మాత్రమే ఉన్నాడని ఆమె తెలిపింది. కూపర్ కొన్నోలీ ఎవరో తనకు తెలియదని, ఆయనకు యాషెస్ సిరీస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపానని వీడియోలో పేర్కొంది.
విడుదల చేసినట్లు చెబుతున్న సంభాషణ స్క్రీన్షాట్లలో, మెల్బోర్న్లో బస చేసిన ప్రదేశం, ఎప్పుడు అక్కడి నుండి వెళ్తున్నారు అనే విషయాల గురించి కూపర్ కొన్నోలీ అడిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, “నన్ను కలవండి” అనే తరహా కొన్ని మెసేజ్లు ఉన్నట్లు చెప్పబడుతోంది. ఈ సమాచారం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించి తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ నేపథ్యంలో, ఆనీ నైట్ చేసిన ఈ ఆరోపణలపై కూపర్ కొన్నోలీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. అలాగే, ఆ మెసేజ్ల గురించి ఆయన స్పందించకపోవడంతో, సోషల్ మీడియాలో వచ్చిన ఈ సమాచారం యొక్క విశ్వసనీయతపై నిరంతరం చర్చలు జరుగుతున్నాయి.

Leave a Reply