భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాల్లో పూరీ ఒకటి. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పూరీని సాధారణంగా నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. అయితే, ఆరోగ్య స్పృహ పెరిగిన ఈ రోజుల్లో “అసలు నూనె లేకుండా పూరీ చేయడం సాధ్యమేనా?” అన్న ప్రశ్న చాలామందిలో ఉంది. దానికి ఇప్పుడు పరిష్కారం దొరికింది.
నూనె లేకుండా పూరీ తయారీ విధానం:
ఆరోగ్యం మరియు డైట్ కారణాల వల్ల చాలామంది నూనె వాడకాన్ని తగ్గించాలని కోరుకుంటారు. అందుకే సోషల్ మీడియాలో ఈ ‘ఆయిల్-ఫ్రీ పూరీ’ రెసిపీ వైరల్ అవుతోంది.
0% నూనెతో పూరీ చేయడం ఎలా?:
పిండి తయారీ: ముందుగా ఎప్పటిలాగే పూరీ పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, గుండ్రంగా పూరీల్లా ఒత్తుకోవాలి.
ఆవిరిపై ఉడికించడం: ఇడ్లీ పాత్రను తీసుకుని, అందులో నీళ్లు పోసి వేడి చేయాలి. పైన ఉన్న ఇడ్లీ ప్లేటులో మనం ఒత్తుకున్న పూరీలను ఉంచి, సుమారు 7-8 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి.
ఆరబెట్టడం: పూరీ పిండి ఉడికిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేటులో వేసి, చల్లారే వరకు పక్కన పెట్టాలి.
తదుపరి ప్రక్రియ (ఎయిర్ ఫ్రైయర్):
ఆరిన పూరీలను ఒక్కొక్కటిగా తీసుకుని ఎయిర్ ఫ్రైయర్ (Air Fryer) లో ఉంచాలి. సుమారు 100°C ఉష్ణోగ్రత వద్ద కేవలం 30 సెకన్ల పాటు ఉంచితే, నూనెలో వేయించినప్పుడు పూరీ ఎలా పొంగుతుందో, ఇక్కడ కూడా అలాగే పొంగుతుంది.
మరో పద్ధతి:
పూరీలను ఒత్తుకున్న తర్వాత, మరుగుతున్న నీటిలో వేసి 1-2 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత పైన చెప్పిన విధంగా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి తీయాలి. ఇది కూడా నూనె లేకుండా పూరీ చేయడానికి ఒక చక్కని మార్గం.
పూరీ చరిత్ర:
పూరీ క్రీస్తుపూర్వం 600వ శతాబ్దం నుండే వాడుకలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో వీటిని నెయ్యితో చేసేవారట. మహాభారతంలో కూడా పూరీ ప్రస్తావన ఉందని చెబుతారు. ఉత్తర భారతం నుండి వచ్చిన ఈ వంటకాన్ని మన ఊర్లలో ఆలూ కూర ( తో కలిపి ఇష్టంగా తింటారు. ప్రారంభంలో దీనిని సాయంత్రం పూట స్నాక్స్లా తినేవారని, కాలక్రమేణా ఇది ఉదయం అల్పాహారంగా, రాత్రి భోజనంగా మారిందని చరిత్ర చెబుతోంది.
