జెరూసలేం: ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా కూటమి యుద్ధం కొనసాగిస్తున్న తరుణంలో, ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు కనిపించకుండా పోవడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.
శుక్రవారం విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో నెతన్యాహు కుడి చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించడం కొత్త వివాదానికి తెరలేపింది. దీంతో, ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో సృష్టించబడిందని, అసలు ప్రధాని బ్రతికే లేరని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.
అనుమానాలకు కారణం ఏంటి?
మార్చి 13న నెతన్యాహు తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన వీడియో చుట్టూ ఈ అనుమానాలు తిరుగుతున్నాయి. లక్షలాది మంది చూసిన ఈ దృశ్యాన్ని సోషల్ మీడియా వినియోగదారులు ‘క్లాసిక్ AI గ్లిచ్’గా అభివర్ణించారు. అమెరికన్ రాజకీయ విశ్లేషకురాలు క్యాన్డెస్ ఓవెన్స్ కూడా “నెతన్యాహు ఎక్కడ ఉన్నారు? ఆయన కార్యాలయం ఎందుకు నకిలీ వీడియోలను షేర్ చేస్తోంది?” అని బహిరంగంగా ప్రశ్నించారు. ప్రధాని కుమారుడు యాయర్ నెతన్యాహు కూడా మార్చి 9 నుండి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది.
పెరుగుతున్న మిస్టరీ:
మరోవైపు, ఇజ్రాయెల్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నుండి అకస్మాత్తుగా వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి రావడం కూడా చర్చకు దారితీసింది. అయితే, ఈ వాదనలన్నింటినీ ఎక్స్ (X) యొక్క AI చాట్‌బాట్ ‘గ్రోక్’ (Grok) తోసిపుచ్చింది. కెమెరా యాంగిల్ వల్ల ఏర్పడిన భ్రమ మాత్రమేనని, నెతన్యాహు క్షేమంగా ఉన్నారని అధికారిక వివరణ ఇచ్చింది. ఇరాన్ అధికారిక మీడియా ఇటువంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని ఇజ్రాయెల్ అనుకూల వర్గాలు ఆరోపిస్తున్నాయి.
యుద్ధం తీవ్రంగా ఉన్న ‘బీట్ షెమేష్’ ప్రాంతంలో శిథిలాల మధ్య నెతన్యాహు నడుచుకుంటూ వెళ్లడం ఆయన చివరిగా పబ్లిక్ లో కనిపించిన దృశ్యం. ఫిబ్రవరి 28న అయాతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ భారీ ఎత్తున ఎదురుదాడి ప్రారంభించడంతో, నెతన్యాహు భద్రత ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని స్వయంగా పబ్లిక్ లోకి వచ్చి ఈ అనుమానాలను పటాపంచలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
