యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని వివిధ ఉద్యోగాల భర్తీకి తమిళనాడు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గరిష్టంగా నెలకు రూ.2.86 లక్షల వరకు వేతనం అందించనున్నట్లు తెలిపింది.
ఎలక్ట్రీషియన్ హెల్పర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ ఫిట్టర్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఐటీఐ (ITI), డిప్లొమా, బీఈ (B.E.) లేదా బీటెక్ (B.Tech) పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎలక్ట్రీషియన్ హెల్పర్ పోస్టుకు 22 నుంచి 40 ఏళ్ల వయసు ఉండి, కనీసం 6 నెలల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి నెలకు రూ.32,000 నుంచి రూ.36,000 వరకు జీతం లభిస్తుంది.
అనుభవం, హోదాను బట్టి వేతనం మారుతుంది. 3 ఏళ్ల అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్‌కు రూ.36,000 నుంచి రూ.52,000 వరకు, ఎలక్ట్రికల్ ఫిట్టర్‌కు రూ.40,000 నుంచి రూ.52,000 వరకు, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్‌కు రూ.65,000 నుంచి రూ.1,04,000 వరకు వేతనం అందిస్తారు. అదనంగా ఓవర్‌టైమ్ పనికి ప్రత్యేక వేతనం కూడా ఉంటుంది.
25 నుంచి 45 ఏళ్ల వయసు ఉండి, 5 ఏళ్ల అనుభవం ఉన్న ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్‌కు రూ.65,000 నుంచి రూ.91,000 వరకు, ఎలక్ట్రికల్ సూపర్వైజర్కు రూ.78,000 నుంచి రూ.1,43,000 వరకు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్‌కు రూ.1,30,000 నుంచి రూ.2,60,000 వరకు, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ ఇంజనీర్‌కు రూ.1,04,000 నుంచి రూ.2,86,000 వరకు జీతం నిర్ణయించారు.
వీసా, వసతి సౌకర్యాలను ఉద్యోగం ఇచ్చే సంస్థే కల్పిస్తుంది. వీసా వచ్చిన తర్వాత సేవా రుసుము కింద రూ.35,400 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల పురుష అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత, పని అనుభవ ధ్రువపత్రాలు, పాస్‌పోర్ట్ కాపీని ovemclnm@gmail.com అనే ఈమెయిల్‌కు 05.12.2026 లోపు పంపాలి. మరిన్ని వివరాలకు www.omcmanpower.tn.gov.in వెబ్‌సైట్‌ను గానీ, 044-22502267 లేదా వాట్సాప్ నంబర్ 95662 39685 ను గానీ సంప్రదించవచ్చు.

Leave a Reply