భారత జట్టు న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ను గెలుచుకున్నప్పటికీ, చివరి రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.
“ఈ బ్యాటింగ్ లైనప్ కేవలం ఫ్లాట్ వికెట్లపై మాత్రమే బాగా ఆడగలదని, భారత్ వెలుపల వీరు క్రమం తప్పకుండా 250 పరుగులు సాధించలేరని నేను ముందే చెప్పాను. భారత జట్టు బలహీనత మరోసారి బయటపడింది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ మంచి శుభారంభం ఇస్తేనే జట్టు భారీ స్కోరును అందుకోగలుగుతోంది, లేదంటే వరుసగా వికెట్లు కోల్పోయి తీవ్రంగా తడబడుతున్నారు” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించాడు.
అతను ఇంకా మాట్లాడుతూ.. “భారత జట్టు ఈ ఇద్దరు ఆటగాళ్లపైనే అతిగా ఆధారపడుతోందని నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఎవరూ దానిని సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగానే చూసి ఉంటారు, ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు పరిస్థితి ఎలా ఉందో అందరికీ స్పష్టంగా అర్థమై ఉంటుంది” అని విమర్శించాడు.
భారత జట్టు సిరీస్ గెలిచినప్పటికీ, పాకిస్థాన్ మాజీ ఆటగాడు చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి.

Leave a Reply