ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఉత్కంఠభరిత పోరులో భారత జట్టు విజయం సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ వేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ వెల్లడించాడు.
ఇంగ్లాండ్ విజయానికి చివరి 6 బంతుల్లో 30 పరుగులు కావాల్సి ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేపై నమ్మకం ఉంచగా, దూబే ఆ లక్ష్యాన్ని కాపాడుకుని భారత్‌కు 7 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు.
అక్షర్ మాట్లాడుతూ.. ఒకవేళ కెప్టెన్ సూర్య తనకు బాధ్యత అప్పగించి ఉంటే తాను సిద్ధంగా ఉండేవాడినని చెప్పాడు. “నేను లాంగ్ ఆఫ్ వద్ద నిలబడి మానసికంగ సిద్ధమవుతున్నాను, బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. 30 పరుగులు అంటే చాలా ఎక్కువ, నేను కచ్చితంగా 5 సిక్సర్లు అయితే తినను అని నాకు తెలుసు” అని అక్షర్ నవ్వుతూ సరదాగా వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ ముఖ్యాంశాలు:
- వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై.
- భారత్ స్కోరు: 253/7 (సంజూ శామ్సన్ 89 పరుగులు).
- కీలక మలుపు: 16వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా కేవలం 8 పరుగులు ఇచ్చి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు.
- ఫైనల్: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (#INDvNZ), మార్చి 8, సాయంత్రం 5:30 గంటలకు.

Leave a Reply