చెన్నై సమీపంలోని మామల్లపురంలో జరుగుతున్న తమిళ వెట్రి కజగం (TVK) జిల్లా కార్యదర్శుల సమావేశంలో విజయ్ ప్రసంగిస్తూ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మరియు తన లక్ష్యంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
విజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- ఒత్తిడికి లొంగను: “నాపై ఒత్తిడి ఉందా అంటే.. ఉంది. కానీ ఇలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేవాడినా నేను? ప్రజలే అసలైన ఒత్తిడిలో ఉన్నారు. మన రాజకీయ ప్రయాణంలో ఇది అత్యంత కీలకమైన సమయం.”
- అవినీతి రహిత పాలన: “మాజీ మరియు ప్రస్తుత పాలకులలా నేను ఎప్పటికీ అవినీతి చేయను. ఏ కుట్రకు, ఒత్తిడికి లొంగిపోను. సినిమానా లేక ‘ముదల్వన్’ (ఒకే ఒక్కడు) సినిమా లాంటి రాజకీయామా అని మీరు అడగొచ్చు. కానీ నేను అవినీతికి వ్యతిరేకంగా నిలబడతాను.”
- బానిసత్వం వద్దు: “నేను ఇక్కడ ఎవరికో బానిసగా ఉండటానికో లేదా ఇతరులపై ఆధారపడి బతుకుదామనో రాజకీయాల్లోకి రాలేదు. అధికార పక్షం, ప్రతిపక్షం తీరును ప్రజలు గమనిస్తున్నారు.”
- ప్రజల నమ్మకం: “ప్రజలు నన్ను నమ్ముతున్నారు. నమ్మిన వారి కోసం పని చేయడమే నా నైజం. ప్రజలు నాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు. నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారు, కానీ నేను ప్రజల కోసం నిలబడతాను.”
- అన్నాదురై సిద్ధాంతం: “రాజకీయాల్లో అందరూ ‘అన్నా’ (సి.ఎన్. అన్నాదురై)ని మర్చిపోయారు. కానీ టీవీకే (TVK) కార్యకర్తలు అన్నాదురైని ఎప్పటికీ మర్చిపోకూడదు. అవినీతి శక్తులు మళ్లీ అధికారంలోకి రాకూడదు.”
