‘నేను ఈ దేశంలో ఇంకా జీవించాలని అనుకుంటున్నాను’; ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరన్న ప్రశ్నకు తాప్సీ పన్ను వైరల్ సమాధానం

సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో బాలీవుడ్ నటి తాప్సీ పన్ను ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఒక హిందీ వార్తా ఛానెల్కా ర్యక్రమంలో ఆమె ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ప్రశ్న – సమాధానం: ఆ షోలోని ‘ర్యాపిడ్ ఫైర్’ రౌండ్‌లో భాగంగా యాంకర్ తాప్సీకి ఒక ప్రశ్న వేశారు. “మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు?” అని అడుగుతూ స్క్రీన్ మీద ఇద్దరు నాయకుల చిత్రాలను చూపించారు. ఒకరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మరొకరు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

తాప్సీ పెద్దగా ఆలోచించకుండా ముందుకు వచ్చి నరేంద్ర మోదీ చిత్రాని ఎంచుకున్నారు (తాకారు). అది చూసి అక్కడి ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. అయితే, వెంటనే ఆమె వెనక్కి వచ్చి.. “నాకు ఈ దేశంలో ఇంకా జీవించాలని ఉంది” అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన 22 సెకన్ల వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది.

పాత వ్యాఖ్యలు: తాప్సీ గతంలో కూడా తన రాజకీయ గొంతుకను వినిపించారు. 2019లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ప్రధానితో మాట్లాడే అవకాశం వస్తే, జాతీయవాదం (Nationalism) అంటే ఏమిటో దేశ ప్రజలకు వివరించమని కోరతాను. ఆయన మన నాయకుడు, ఆయన చెప్పే మాటలు అనుసరించే వారిపై ప్రభావం చూపుతాయి” అని పేర్కొన్నారు.


Posted

in

by

Tags: