“నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా..?” వేదికపై అడిగిన ఎమ్మెల్యే.. ‘తప్పకుండా చేయండి’ అని జనాల నుంచి సమాధానం రావడంతో షాక్ అయిన రాజకీయ నాయకుడు.. వైరలవుతున్న వీడియో..!!

మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లాం జిల్లా సైలానా నియోజకవర్గానికి చెందిన భారతీయ ఆదివాసీ పార్టీ ఎమ్మెల్యే కమలేశ్వర్ డోడియార్, ఒక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి “నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా?” అని అడిగిన ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

రత్లాం జిల్లా రాణిసింగ్ గ్రామంలో భగవాన్ బిర్సా ముండా జయంతి మరియు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కమలేశ్వర్ డోడియార్, రాజకీయ పరిస్థితులు మరియు వివిధ అంశాల గురించి మాట్లాడుతున్నారు.

ఆ సమయంలో సభలో ఉన్న కొందరు యువకులు, ఒక మంత్రి తల్లి మరణిస్తే ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి పరామర్శించడాన్ని ప్రస్తావిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాజకీయాల గురించి కాకుండా, ఆదివాసీ సమాజం యొక్క హక్కులు మరియు వారి సమస్యల గురించి మాట్లాడాలని వారు వాగ్వాదానికి దిగారు.

ప్రజల వ్యతిరేకతను చూసి ఆగ్రహించిన ఎమ్మెల్యే కమలేశ్వర్ డోడియార్, మంత్రి ఇంటికి వెళ్లినందుకు తాను రాజీనామా చేయాలా అని వేదికపై నుంచే జనాలను ప్రశ్నించారు. వెంటనే గుంపులోని కొందరు “అవును, రాజీనామా చేయండి” అని గట్టిగా అరిచారు.

దీనికి బదులిచ్చిన ఎమ్మెల్యే, “సరే, రాజీనామా లేఖ ఇవ్వడానికి భోపాల్ వెళ్లాలి” అని వ్యంగ్యంగా అనడంతో పాటు, దీనిపై వివరణ కూడా ఇచ్చారు. తాను కేవలం మానవతా దృక్పథంతోనే పరామర్శించడానికి వెళ్లానని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని ఆయన వివరించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *