ఐబీపీఎస్ (IBPS CRP) పరీక్షలో విజయం సాధించి, ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగం వచ్చిందన్న వార్తను కూతురు చెప్పగానే, అది విని ఆ తండ్రి ఆనందబాష్పాలు రాల్చిన దృశ్యం నెటిజన్లను కదిలిస్తోంది.
తన కుమార్తె కష్టానికి దక్కిన ఈ విజయాన్ని తెలుసుకున్న ఆ మధ్యతరగతి తండ్రి, భావోద్వేగంతో చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడవడం చూస్తుంటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానదు.
తండ్రి త్యాగానికి దక్కిన గౌరవం
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైరల్ అవుతున్న ఈ వీడియో, ఒక తండ్రి పడే తపనకు మరియు పిల్లల విజయానికి మధ్య ఉన్న ఉన్నతమైన అనుబంధాన్ని తెలియజేస్తోంది. “పిల్లల పురోగతే తల్లిదండ్రులకు లభించే అతిపెద్ద పురస్కారం” అంటూ నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ, ఆ కుమార్తెకు అభినందనలు, తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a Reply